విజయనగరం

ప్రతిష్ఠాత్మకంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, మార్చి 9: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగాయి. ఈ మేరకు ఈ పర్యాయం శాసనమండలి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రధాన పార్టీ నేతలు అభ్యర్థి విజయానికి విశ్వప్రయత్నాలు చేశారు. స్థానిక రాజా కళాశాలలో నాలుగు పోలింగ్ కేంద్రాల ద్వారా ఎన్నికలను నిర్వహించారు. ఈ మేరకు మొత్తం 3,263 మంది పట్ట్భద్రులు ఓటుహక్కును వినియోగించుకోవల్సి ఉండగా 2,319మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో సుమారు 72శాతం ఓటింగ్ పోలైంది. ఉదయం 10గంటల వరకు ఎన్నికల పోలింగ్ మందకొడిగా జరిగిన అనంతరం పట్ట్భద్రులు తండోపతండాలుగా ఒకేసారి తరలివచ్చారు. దీంతో బారులుతీరి మండుటెండల్లో ఓటర్లు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నారు. బొబ్బిలి డిఎస్పీ ఆధ్వర్యంలో సిఐ రవి, ఎస్.ఐ. అమ్మినాయుడు పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. తహశీల్దార్ కోరాడ సూర్యనారాయణ పర్యవేక్షణలో సిబ్బంది సజావుగా ఎన్నికల నిర్వహణకు సహకరించారు. ఈ మేరకు బొబ్బిలి ఎమ్మెల్సీ సుజయ్‌కృష్ణరంగారావు, పురపాలక సంఘం మాజీ ఛైర్మన్ ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు, పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి, దేశం పార్టీ కార్యవర్గ కార్యదర్శి తూముల భాస్కరరావులు స్లిప్‌లు ఏర్పాటు చేసిన సెంటర్ వద్ద కూర్చొని తమదైన శైలిలో ఓటర్లను అభ్యర్థించారు.
పట్ట్భద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఉదయం 10గంటల వరకు మందకోడిగా జరిగిన పోలింగ్ ఒక్కసారిగా ఊపందుకుంది. 72శాతం పోలింగ్ కాగా 66వ పోలింగ్ కేంద్రంలో 1191 ఓట్లు ఉండగా 856 పోలయ్యాయి. అలాగే 67వ కేంద్రంలో 850 ఓట్లు ఉండగా 440 పోలయ్యాయి. 67 ఏ కేంద్రంలో 365 ఓట్లు ఉండగా 249 పోలయ్యాయి. 68వ కేంద్రంలో 858 ఓట్లు ఉండగా 584 పోలయ్యాయి. మొత్తం నాలుగు కేంద్రాల్లో వెరసి 3,269 మంది ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవల్సి ఉండగా 2,319మంది ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నారు. మరో 944మంది ఓటర్లు హాజరుకాలేదు
పట్ట్భద్రుల ఎన్నికలు సజావుగా జరిగేందుకు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది డి.ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో అడుగడుగునా పోలీస్‌బందోబస్తు మధ్య ఎన్నికలను నిర్వహించారు. పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 15కేంద్రాలను ఏర్పాటు చేయగా 60మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు డి.ఎస్పీ సౌమ్యలత తెలిపారు.
బొబ్బిలిలో ఏర్పాటు చేసిన నాలుగు కేంద్రాల్లో స్పెషల్ ఫోర్స్ సి.ఐ. రవి ఆధ్వర్యంలో 20మందితో బందోబస్తును నిర్వహించామన్నారు.

పోలీసులతో వాగ్వివాదం

ఎన్నికల కేంద్రం వద్ద ప్రజాసంఘాలు, పి.డి.ఎఫ్. బలపర్చిన అజశర్మకు మద్ధతుగా ప్రచారం చేస్తున్న యు.టి.ఎఫ్. రాష్ట్ర సహాయ కార్యదర్శి విజయగౌరి, ఎస్.ఎఫ్.ఐ.నాయకులు సురేష్‌లకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పోలింగ్ కేంద్రం గేటు సమీపంలో ఉన్న విజయగౌరి, సురేష్‌లను దూరంగా వెళ్లాలని పోలీసులు హెచ్చరించడంతో మనస్థాపానికి చెందిన విజయగౌరి అధికార పార్టీ నేతలు కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న ఎందుకు వౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. దీంతో డిఎస్పీ సౌమ్యలత జోక్యం చేసుకుని కేంద్రానికి ఇరువైపులా ఇద్దరు కానిస్టేబుల్స్‌ను ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించారు.

బి.జె.పి. అధ్యక్షులు ఓటు వినియోగం

బి.జె.పి. జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు కుటుంబీకులతో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటును సద్వినియోగం చేసుకున్నారు. 67వ పోలింగ్ కేంద్రంలో తనతోపాటు ఇద్దరు కుమారులు, అల్లుడుతో కలిసి వచ్చి ఓటును వినియోగించుకున్న అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ బి.జె.పి., దేశం పార్టీల బలపర్చిన మాదవ్ అధికశాతం ఓట్లు మెజార్టీతో గెలుపుఖాయమన్నారు.