విజయనగరం

సమరయోధుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, మార్చి 11: స్వాతంత్ర సమరయోధుడు గొర్లె నర్సుములునాయుడు శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. ఈయన వయస్సు 93 సంవత్సరాలు ఈయన గాంధీ మహాత్ముడుతో శ్రీకాకుళం జిల్లా దూసి రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి మహాత్మాగాంధీని కలసి స్వాతంత్ర సమరానికి మద్దతు పలికారు. అలాగే కలకత్త, ముంబాయిలలోకూడా పోరాటాలు సాగించారు. ఈయనకు 20వ ఏట నుంచే స్వాతంత్ర పోరాటలలో పాల్గొనేవారు. ఈయనకు భార్య ఆరుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆరుగురు కుమారులలో ముగ్గురు వివిధ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ముగ్గురు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. కుమార్తె శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గారపేట సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన స్వాతంత్ర సమరాన్ని నాటకాల రూపంలో పలు ప్రదర్శనలు చేశారు. గ్రామానికి వ్యవసాయ పరపతి సంఘాన్ని తీసుకువచ్చి అదే సంఘానికి 15 ఏళ్లపాటు అధ్యక్షుడు సేవలు అందించారు. ఈయన మృతికి పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
క్షేత్ర స్థాయి నుంచి వైకాపా బలోపేతం

* రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విజయసాయిరెడ్డి

విజయనగరం (్ఫర్టు), మార్చి 11: రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాజ్యసభ సభ్యుడు, వైకాపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి.విజయసాయిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ, వైకాపా ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి సారధ్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా నిర్మితమవుతున్న జిల్లా కార్యాలయాన్ని శనివారం సాయంత్రం ఆయన సందర్శించారు. జిల్లా పార్టీ అనుబంధ సంఘాల సమీక్షా సమావేశానికి హాజరైన ఆయన పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విజయుసాయిరెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. కార్యాలయ నిర్మాణపనుల గురించి విజయసాయిరెడ్డికి వైకాపా ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి వివరించారు. వచ్చేనెల ఒకటోతేదీనాటికి భవన నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. విజయసాయిరెడ్డి వెంట పార్టీ నాయకులు సాగి దుర్గాప్రసాదరాజు, ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, పార్టీ పాలకమండలి సభ్యుడు పి.సాంబశివరాజు, ఎస్.కోట సమన్వయకర్త నెక్కల నాయుడుబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, కాయల వెంకటరెడ్డి,కడియాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వైకాపా నేతలకు ఘనస్వాగతం
జిల్లా అనుబంధ సంఘాల సమావేశానికి శనివారం హాజరైన రాజ్యసభ్యుడు, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే, వైకాపా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రోజాకు ఘనస్వాగతం లభించింది. పట్టణానికి సమీపంలో విటి అగ్రహారం వై జంక్షన్ వద్దకు చేరుకోగానే విజయనగరం నియోజకవర్గ పార్టీ నాయకులు ఆశపువేణు, నడిపేన శ్రీనువాసరావు, సీనియర్ కౌన్సిలర్ ఎస్‌వివి రాజేశ్వరరావు(రాజేష్) ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలివెళ్లి స్వాగతం పలికారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.