విజయనగరం

త్వరలో జాతీయ డిజిటల్ పేమెంట్ మిషన్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 14: త్వరలో జాతీయ డిజిటల్ పేమెంట్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హా వెల్లడించారు. మంగళవారం ఆయన వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నగదు రహిత లావాదేవీలు దోహదపడతాయన్నారు. నగదు రహిత లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల విధానంపై ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ చెల్లింపులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఐదు రకాల డిజిటల్ చెల్లింపుల గురించి వివరించారు. యుపిఐ (యుటిలిటి పేమెంట్ సిస్టమ్), జిఎస్‌ఎం ఫోను, యుఎస్‌ఎస్‌డి (అన్‌స్ట్రాక్టడ్ సప్లిమెంటరీ డేటా మొబైల్ బ్యాంకింగ్), డెబిట్ క్రెడిట్ కార్డులు, వాలెట్స్, ఆధార్ ఎనాబుల్డ్ పేమెంట్ సిస్టిమ్ విధానాల ద్వారా నగదు రహిత ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్థిక కార్యాకలాపాలు నగదు రహితంగా నిర్వహించాలన్నారు. మొబైల్ బ్యాంకింగ్, పిఒఎస్ విధానం, పేటిఎం విధానం ద్వారా బ్యాంకులు అందిస్తున్న యాప్‌ల డౌన్‌లోడ్ ద్వారా ఆర్ధిక లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. బ్యాంక్ ఖాతాలను ఆధార్‌కు అనుసంధానం చేసే ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా 27.77 కోట్ల బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్నారు. 21.59 కోట్ల రూపే కార్డులు ఖాతాదారులకు జారీ చేశారని తెలిపారు. ఇపోస్ వినియోగంపై అవగాహన కల్పించి అవసరమైన యంత్రాలను సరఫరా చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, ఎల్‌డిఎం గురవయ్య, నాబార్డు ఎజిఎం శ్రీనివాస్, ఇన్‌ఛార్జి డిఎస్‌ఒ నాగేశ్వరరావు, ఎన్‌ఐసి అధికారి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.