విజయనగరం

స్టేషన్ మాస్టారుతో ప్రయాణీకులు ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, మార్చి 14: గజపతినగరం రైల్వే స్టేషన్‌లో స్టేషన్ మాస్టారుతో మంగళవారం ప్రయాణీకులు ఘర్షణకు దిగారు. స్టేషన్ మాస్టారు నిర్లక్ష్య ధోరణి బాధ్యతారాహిత్యంతో ప్రయాణీకులతో గొడవకు దిగాల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నుంచి రాయగడకు వెళ్లే రైలు 10.40 నిమిషాలకు ఈ స్టేషన్‌కు వస్తుంది. ఇక్కడి నుండి రాయగడ లోపు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు సుమారు 40 మంది ప్రయాణీకులు బుకింగ్ కౌంటర్ వద్ద టికెట్ల కోసం వేచి ఉన్నారు. 10.30 వరకు బుకింగ్ కౌంటర్ తెరవకపోవడంతో ప్రయాణీకులు అయోమయంగా ఫ్లాట్ ఫారంలో వేచి ఉన్నారు. ఇంతలో ఒక ప్రయాణీకుడు చొరవ తీసుకుని స్టేషన్ మాస్టారును ఈ పరిస్థితిపై ప్రశ్నించగా తొందరెందుకు రైలు వచ్చే ముందు ఇస్తాములే అంటూ నిర్లక్ష్యంగా చెప్పడంతో మిగిలిన ప్రయాణీకులు స్టేషన్ మాస్టారుతో గొడవకు దిగారు. మీరు నన్ను ప్రశ్నించడమేమిటని నాకు నచ్చినపుడు కౌంటర్ తెరుస్తామంటూ మళ్లీ బాధ్యతా రాహిత్యంగా స్టేషన్ మాస్టారు మాట్లాడడంతో ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో మిగిలిన ఉద్యోగులు ప్రయాణీకులను సముదాయించి కౌంటర్ ద్వారా టికెట్లు ఇవ్వడంతో గొడవ వాతావరణ సద్దుమణిగింది. ఈ స్టేషన్ మాస్టారు డ్యూటీలో ఉన్న ప్రతిసారి ఇలాంటి పరిస్థితే నెలకొంటుందని ఎంఎస్‌టిలు కొందరు తెలిపారు. ఈ గొడవ విషయాన్ని స్టేషన్ మాస్టారును విలేఖరులు ప్రశ్నించే ప్రయత్నం చేసినా ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు.
మరుగుదొడ్లు నిర్మాణంలో
కన్నాం గ్రామానికి ప్రధమ స్థానం
దత్తిరాజేరు, మార్చి 14: జిల్లాలో దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామం మరుగుదొడ్లునిర్మాణంలో ప్రథమ స్థానంలో ఉండడంతో నిర్మాణానికి కృషి చేసిన కన్నాం గ్రామ ప్రజలు, మండల స్థాయి అధికారులు అభినందనీయులని జిల్లా డిఆర్‌డిఎ పిడి ఢిల్లీరావు అన్నారు. మంగళవారం కన్నాం గ్రామంలో ఉన్న 165 కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకోవడంతో అధికారుల కృషి ప్రశంసనీయమని ఢిల్లీరావు అన్నారు. కన్నాం గ్రామంలో ఉన్న 165 కుటుంబాల వారు మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు వారిలో అవగాహన కల్పించిన మండల ప్రత్యేక అధికారి ఎస్.వెంకటరావు, ఎంపిడిఓ కె. ఆర్.వి.పట్నాయిక్ కృషి ఫలితంగా మరుగుదొడ్లు నిర్మాణంలో జిల్లాలో ప్రథమ స్థానం సాధించారని వారిని కొనియాడారు. అలాగే లక్ష్యం మేరకు కన్నాం గ్రామంలో మరుగుదొడ్లు నిర్మాణం పూర్తయిన దర్మిలా ఓడిఎఫ్ గ్రామంగా ప్రకటించిన దాసరిపేట గ్రామంలో 98 మరుగుదొడ్లు శరవేగంగా నిర్మాణం జరిగినందుకు ఆ గ్రామస్తులు అభినందనీయులని ఢిల్లీ రావు అన్నారు. అలాగే దాసరిపేట, కన్నాం గ్రామంలో నిర్మించిన మరుగుదొడ్లు నిర్మించిన గ్రామ ప్రజలకు తహశీల్దార్ కల్పవల్లి, ఏపి ఎం అచ్యుతరావు, ఆర్‌డబ్ల్యు ఎస్ జెఇ చంద్రకళ, మండల సాక్షరభారత్ కో- ఆర్డినేటర్ ఆర్.గోవింద, ఏపిఓ వెంకటప్పలనాయుడు, ఎంఇఓ వెంకటరావు, జెఇ చంద్రశేఖర్, డిఇ గోవిందరావులతోపాటు గ్రామ ప్రజలు అభినందనీయులని ఆయన అన్నారు.

సిక్కుల కాలనీలో సమస్యల తిష్ట
* పరిష్కరించాలని వేడుకోలు
విజయనగరం(టౌన్), మార్చి 14: పట్ణణంలో పలు ప్రాంతాలు సమస్యలకు నిలయంగా మారాయి. ఏళ్ల తరబడి అయి పరిష్కారానికి నోచుకోక అక్కడ నివసించే ప్రజలకు అవస్ధలు తెచ్చి పెడుతున్నాయి. వార్షాకాలం వచ్చిం దంటే మురుగుపోయే మార్గంలేక, ఇళ్లనుండి బయటకు పోయేందుకు సరైన రహదారి లేక సమస్యల నడుమ జీవిస్తున్నారు. ఇందులో భాగంగానే పట్టణం కంటోనె్మంట్ సిక్కుల కాలనీలో సమస్యలు అపరిష్కృతంగా తిష్టవేసాయి. సిక్కుల కాలనీ ఏర్పడి సుమారు 17 సంవత్సరాలు కావస్తున్నా అక్కడ కనీస సౌకర్యాలు లేవని దుర్గంద భరితంగా కాలనీ పరిసరాలు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో నివసించే సుమారు 30 కుటుంబాలకు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు నిర్మాంచాలని దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకోలేదని ఆయనకు ఫిర్యాదు చేసారు. కాగా కాలనీకి ఆనుకుని పాఠశాల ఉందని సమీపంలో ఉన్న చెరువు పూడుకుపోయి బహిరంగ మలవిసర్జనకు కేంద్రంగా మారిందని వాపోయారు. దీంతో విద్యార్ధుల అంటురోగాల బారిన పడుతున్నారని , మున్సిపల్ యంత్రాంగం చర్యలు తీసుకుని పూడుకు పోయిన చెరువును అభివృద్ధిచేసి వినియోగంలోకి తీసుకురావాలని, పార్కుగా ఏర్పాటు చేయాలని స్ధానికులు కోరుతున్నారు.