విజయనగరం

ఉగ్రవాదం పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), మార్చి 14: ఉగ్రవాదం వైపు యువత ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా బిజెపి మైనార్టీ విభాగం అధ్యక్షుడు భాషా తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని సూచించారు. సోషల్ నెట్‌వర్క్ సెట్లలో ఉగ్రవాద ప్రేరేపిత భావాలకు ఆకర్షితులు కావద్దని హితవు పలికారు. అభం శుభం తెలియని యువత అటువంటి భావజాలాలకు లోనుఅయి వారి కుటుంబాలను వీధిన పడేలా చేసుకోవడం దేశానికి మంచిది కాదని అన్నారు. భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మధ్యప్రదేశ్‌లో చటోచేసుకున్న రైలు బాంబు ఘటనలో భోరాసన్ అనే సంస్ధ చేసి నట్లు తేలిందని ఇండియాలో యువతను తన కార్యకలాపాలకు వినియోగించుకుని వారి జీవితాలను నాశనం చేస్తున్నవారి పట్ల అప్రతమత్తంగా ఉండి చీడపురుగుల్లా వ్యవహరిస్తున్న అటువంటి వారి ఆటలు కట్టించేందుకు జాగరూకతో వ్యవహరించాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు షకీల్,షేక్‌చాంద్, పాండ్రంకి సంతోష్,పట్టణ యూత్ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

చట్టబద్ధమైన దత్తతను ప్రోత్సహించాలి
* అక్రమ దత్తతలను నిరోధించేందుకు చర్యలు
* కారా సలహా సంఘ చైర్మన్

విజయనగరం, మార్చి 14: దేశంలో అక్రమ దత్తతలను నిరోధించేందుకు కేంద్రం సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అధారిటీ (కారా)ను ఏర్పాటు చేసిందని ఆ సంస్థ సలహా కమిటీ చైర్మన్ ఎం.రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ఇక్కడ కెఎల్ పురం రెవెన్యూ కాలనీలోని శిశుగృహను ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చట్టబద్ధత కలిగిన దత్తతకు వెళ్లిన బాల, బాలికలకు భవిష్యత్‌లో ఎలాంటి ఢోకా ఉండదన్నారు. దేశ వ్యాప్తంగా అధికారికంగా బాల, బాలికల దత్తత కోసం ఇప్పటి వరకు 20వేల మంది దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రంలో 2వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కాగా, ప్రతి జిల్లాలో ఏటా వంద మంది పిల్లలు దత్తత తీసుకునే విధంగా చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. దత్తత తీసుకునే వారికి కేంద్రం మంచి ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. అక్రమ దత్తతలను నిరోధించేందుకు కేంద్రమంత్రి మేనకాగాంధీ నాయకత్వంలో కేంద్ర స్ర్తి, శిశు సంక్షేమశాఖ 2015 ఆగస్టులో పార్లమెంట్‌లో చట్టం చేసిందన్నారు. ఈ చట్టంలో దత్తతకు అర్హులైన బాలబాలికలను దత్తత ఇచ్చే సమయంలో పాటించాల్సిన నియమావళిని పూర్తి స్థాయిలో పొందుపరిచిందన్నారు. ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం శిశుగృహంలో ఆతిధ్యం పొందుతున్న బాలలు అన్నపూర్ణ, దుర్గారావులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో కారా సభ్యుడు వాసుబాలన్, ఒఎస్‌డి జి.శ్రీను, ఐసిడిఎస్ పిడి రాబర్ట్స్, డిసిపిఒ లక్ష్మి, ఎపిడి ఉషారాణి, శిశుగృహ మేనేజర్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.