విజయనగరం

రైతులకు రెండింతల ఆదాయం లభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 16: రైతులకు రెండింతల ఆదాయం లభించేందుకు ఏ విధమైన పద్ధతులను అనుసరించాలనే విషయమై ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయం డైరెక్టర్ రాజారెడ్డి వివరించారు. గురువారం డిఆర్‌డిఎ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు సమాచారం అందజేసేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయని వాటన్నింటిని ఉపయోగించుకొని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ చేపట్టాలన్నారు. జిల్లాలో వర్షాధారంపై పంటలు అధికంగా సాగుచేస్తున్నందున అందుకు అనుకూలమైన వరి రకాలను వారికి సరఫరా చేయాలని సూచించారు. మరికొంత మంది మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 10 మంది రైతులను ఎంపిక చేసి వారికి వివిధ పంటలపై అవగాహన కల్పిస్తే బాగుంటుందన్నారు. జిల్లాలో ఆలస్యంగా పంటలు సాగుచేయడం వల్ల రైతులు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఆయన వద్ద ప్రస్తావించగా దీని గురించి కమిషనర్‌కు వివరిస్తానన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఎ పిడి డిల్లీరావు మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులతో కలసి శిక్షణ కార్యక్రమాలు విస్తృతం చేస్తే బాగుంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ వేణుగోపాలరావు, డాట్ కోఆర్డినేటర్ లక్ష్మణ, గాజులరేగ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్తవ్రేత్తలు తదితరులు పాల్గొన్నారు.
===========

కాయకల్ప అవార్డు పట్ల హర్షం

విజయనగరం, మార్చి 16: జిల్లాకు కాయకల్ప అవార్డు లభించడం పట్ల జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి కాయకల్ప అవార్డు లభించడం పట్ల సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆయన కోరారు. అనంతరం కాయకల్ప అవార్డులకు ఎంపికైన ఉత్తమ పిహెచ్‌సి, సిహెచ్‌సి, రన్నర్ అప్, కన్సోలేషన్‌కు ఎంపికైన వారికి మెమెంటోలు, ప్రశంసా పత్రాలను ఆయన అందజేశారు. జిల్లా స్థాయిలో ఉత్తమ సిహెచ్‌సిగా బోగాపురం, ర్ననర్‌అప్‌గా ఎస్.కోట, కన్సోలేషన్ అవార్డుకు బాడంగి పిహెచ్‌సిలు ఎంపికయ్యాయి. ఉత్తమ సిహెచ్‌సికి రూ.5 లక్షలు, రన్నర్ అప్‌కు రూ.2 లక్షలు, కన్సోలేషన్ అవార్డు కింద రూ.1 లక్ష నగదు బహుమతిని ప్రభుత్వం త్వరలో అందజేయనుంది. అలాగే ఉత్తమ పిహెచ్‌సి కింద రామభద్రాపురం, కన్సోలేషన్ పిహెచ్‌సిలుగా అలమండ, పూసపాటిరేగ, తెర్లాం ఎంపికయ్యాయి. ఉత్తమ పిహెచ్‌సికి లక్ష, కన్సోలేషన్‌కు రూ.50 వేలు నగదు బహుమతిని త్వరలో అందజేయనున్నారు. వీరికి మెమెంటోలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్ పద్మజ, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ ఉషశ్రీ, జిల్లా క్వాలిటీ కన్సల్టెంట్ కమలాకర్, క్వాలిటీ మేనేజర్ ఆర్నాల్డ్స్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

‘పరిశోధనా ఫలాలు రైతుల దరికి చేరాలి’

విజయనగరం, మార్చి 16: వ్యవసాయ పరిశోధన ఫలాలు రైతుల దరి చేరాలని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ రాజురెడ్డి పిలుపునిచ్చారు. ఏడు జిల్లాలకు చెందిన ఏరువాక కేంద్రం, కెవికె శాస్తవ్రేత్తలు హాజరయ్యారు. విస్తరణ కార్యక్రమాలు బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆయన వివరించారు. వ్యవసాయ పద్ధతులలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం జోడించాలన్నారు. వ్యవసాయంతోపాటు అనుబంధ పరిశ్రమలను నెలకోల్పుకోవాలన్నారు. కనీసం పాడి ఆవులు, గేదెలు ఉన్నట్టయితే రైతులకు మరింత లాభదాయకంగా ఉంటుందన్నారు. పంటలు సాగు చేసే విధానం గురించి మాట్లాడుతూ జీరో టినే్నజి పద్దతిలో మొక్కజొన్న, డ్రమ్ సీడర్ పద్దతిలో వరిసాగు చేసుకోవాలని సూచించారు. వరిలో మధ్యకాలిక రకాలు సాగుచేసుకుంటే లాభసాటిగా ఉంటుందన్నారు. దాంతోపాటు అపరాల సాగుచేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన అసోసియేట్ డైరెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాకు అనుకూలమైన పంటలతోపాటు ఇతర పంటలు సాగుచేసుకుంటే లాభదాయకంగా ఉంటుందన్నారు. చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు జోగినాయుడు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో గిరిజన యువతను అనుసంధానం చేసుకొని నేలను పరిరక్షించుకుంటూ సేంద్రీయ పద్దతులను అవలంభించాలని సూచించారు. జెడి లీలావతి మాట్లాడుతూ రైతు శిక్షణ కేంద్రాలను బలోపేతం చేసి వారికి గ్రామాల్లో పర్యటించినపుడు వాహనాలతోపాటు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. ఉద్యానశాఖ డిడి లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రతి పంచాయితీకి ఒక వ్యవసాయ అధికారి ఉండేలా చర్యలు తీసుకుంటే శాస్త్ర వేత్తల సూచనలు రైతులకు అందజేయడానికి బాగుంటుందన్నారు. డాట్ కోఆర్డినేటర్ లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లాలో వరికి అనుకూలమైన రకాలు శాస్త్ర పరిశోధనలు చేసి రైతులకు సిఫార్సు చేసినట్టు తెలిపారు. వరిలో ఎన్‌ఎల్‌ఆర్ 4001, ఎంటియు 1140, 1156 రకాలు, మినుములో టిబియు 104, పెసరలో టిఎం 96 రకాలుసిఫార్సు చేశారు.