విజయనగరం

జిల్లాను ఒడిఎఫ్‌గా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 20: జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత (ఒడిఎఫ్)గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎంపిడిఒలు, ప్రత్యేకాధికారులతో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మరో 20వేల మరుగుదొడ్లను నిర్మించాలని స్పష్టం చేశారు.
ప్రతి మండలంలో నాలుగు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి మరుగుదొడ్ల నిర్మాణాలకు అవసరమైన షెడ్యూల్ రూపొందించాలన్నారు. ఈ నెల 31 నాటికి షెడ్యూల్ ఖరారు చేయాలన్నారు. గ్రామ సర్పంచ్‌లు, ఎన్జీవోల నేతృత్వంలో మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టాలన్నారు. తాపీ మేస్ర్తిల డైరెక్టరీని సిద్దం చేసి గృహనిర్మాణశాఖకు అందజేయాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో సర్పంచ్‌లకు, కాంట్రాక్టర్లకు శిక్షణనివ్వాలన్నారు. వచ్చే నెల 12 నాటికి మరుగుదొడ్ల నిర్మాణాలకు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేయాలన్నారు. నిర్మాణాలను వేగంగా పూర్తి చేసిన వారికి గ్రామ స్థాయి, మండల స్థాయిలో అవార్డులు అందజేస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల నాణ్యతలను స్వచ్ఛంద సంస్థలు, యునిసెఫ్ బృందాలతో తనిఖీ చేయిస్తామన్నారు. పనులు చేపట్టిన 121 గ్రామ పంచాయతీలకు ర్యాంకింగ్‌లు ఇస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, నీటి సరఫరా, పైకప్పు నిర్మాణం, నిర్వహణ ఆధారంగా ర్యాంకింగ్‌లు ఇస్తామన్నారు. 43 గ్రామ పంచాయతీలలో స్ర్తినిధి మ్యాపింగ్ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు స్పష్టం చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని 60 ఏళ్ల వృద్ధులను పనిలో పెట్టరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా అధికారుల ఫొన్ నంబర్లకు సంబంధించి విజెడ్‌ఎం ఇ-డైరెక్టరీని రూపకల్పన చేసినట్టు కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. అధికారులు తమ ఫోన్ నంబర్లను మరోసారి చెక్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెసి నాగేశ్వరరావు, జెడ్పి సిఇఒ రాజకుమారి, డ్వామా పిడి ప్రశాంతి, డిఆర్‌డిఎ పిడి డిల్లీరావు, పశుసంవర్థకశాఖ జెడి సింహాచలం, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకొండి

విజయనగరం, మార్చి 20: జిల్లాలో వేసవిలో వడదెబ్బకు ఎవరు గురికాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా జెసి లఠ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్లు, ఐసిడిఎస్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ గత ఏడాది వడదెబ్బ కారణంగా 125 మంది మృత్యువాతపడ్డారని, ఈ ఏడాది అలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రాంతాల్లో 104 వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. గర్భిణులు, 60 ఏళ్లు దాటిన వారు, చక్కెర వ్యాధిగ్రస్తులను పనుల్లోకి అనుమతించవద్దన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనైతే వారికి నీడ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పనులు కల్పించాలన్నారు. అన్ని పిహెచ్‌సిలలో ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలన్నారు. వడదెబ్బకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా పిడి ప్రశాంతి, డిఎంహెచ్‌ఒ డాక్టర్ పద్మజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.