విజయనగరం

మీకోసం గ్రీవెన్స్‌లో సమస్యల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), మార్చి 20: పలు సమస్యలు పరిష్కారం కోరుతూ మీకోసం గ్రీవెన్స్‌లో వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన అర్జీదారులు వినతులు అందించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ వివేక్‌యాదవ్, జెసి శ్రీకూకేష్‌లఠ్కర్, ఎజెసి నాగేశ్వరావులు వినతులు స్వీకరించారు. మూతపడిన అరుణాజూట్ మిల్లును తెరిపించి కార్మిక కుంటుంబాలకు న్యాయం చేయాలని ఎ ఐ ఎఫ్ టియు ఆధ్వర్యంలో కలెక్టర్ గ్రీవెన్స్‌లో వినతిని అందచేసారు. ఈసందర్భంగా యూనియన్ నాయకులు బెహరా శంకరరావు మాట్లాడుతూ జూట్ మిల్లులు తిప్పేందుకు ఇపుడు అనుకూల పరిస్ధితులు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం విదేశాలనుండి దిగుమతి చేసుకునే జూట్‌పై సుకం విధించడం, గోనె సంచులు జూట్‌వి వినియోగించాలని సూచించడం వంటివి అనుకూలంగా ఉన్నాయని చెపుతూ ఈనేపథ్యంలోఅరుణా జ్యూట్ యాజమాన్యాన్ని పిలిపించి మిల్లును తిరిగి తిప్పుతారా అనేది స్పష్టం చేయాలని కోరారు. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు ఇందుకు చొరవ తీసుకుని కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు పొంతపల్లిశ్రీను, బోడసింగి అప్పారావు, రౌతు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కాగా నెల్లిమర్ల ఐసి డి ఎస్ ప్రాజెక్టులో లింక్ వర్కర్లుగా ఏడాది కాలంగా పనిచేస్తున్నామని అయితే ఇంతవరకు తమకు ఎటువంటి వేతనాలు చెల్లించలేదని బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అంగన్ వాడీ లింక్ వర్కర్లు మంగ,రాముడమ్మ, శ్యామల, రామలక్ష్మి,పార్వతి తదితరులు కోరారు. ఎస్ కోటలోని జామియా మసీదును మసీదు కమిటీలోని మెజార్టీ సభ్యుల అంగీకారం లేకుండా ఎలా వక్ఫ్ బోర్డులోకి తీసుకు వస్తారని, జామియా మసీదును మసీదు కమిటీ ఆధ్వర్యంలోనే కొనసాగించి న్యాయం చేయాలని కోరుతూ మసీదు కమిటీ సభ్యులు నాయక్స్రూల్, జాఫర్‌బేగ్, షేక్‌వజీర్ తదితరులు కోరారు. బ్యాంకు లింకేజి రుణం మంజూరుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విటి అగ్రహారానికి చెందినప్రేమసాయి పొదుపు సంఘం మహిళలు సర్వశెట్టి లక్ష్మికోరారు. ఇదిలాఉండగా పలువురు అర్జీదారులు పింఛన్లు, రేషనుకార్డుల మంజూరు చేయాలని వ్యక్తిగత అంశాలపై ఫిర్యాదులు అందచేసారు.

ఆస్తిపన్ను వసూళ్లలో
అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

విజయనగరం (్ఫర్టు), మార్చి 20: పట్టణంలో ఆస్తిపన్ను వసూళ్లలో అలసత్వం వహించే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ డిప్యూటీడైరెక్టర్, విజయనగరం మున్సిపల్ పన్నుల వసూళ్ల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి ఆర్.సోమన్నారాయణ హెచ్చరించారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పన్ను వసూళ్లలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా చర్యలు తప్పవని, అవసరమైతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పన్ను వసూళ్లలో రాష్ట్రంలో విజయనగరం మున్సిపాలిటీకి మంచిపేరు లేదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. పన్నుల వసూళ్ల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందాలు తమకు నిర్థేశించిన ప్రాంతాలలో పర్యటిస్తూ పన్నువసూళ్ల లక్ష్యాలను నెరవేర్చాలన్నారు. ముఖ్యంగా మొండిబకాయిదారులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే ఆస్తులను జప్తు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కువమొత్తంలో బకాయిపడి పన్ను చెల్లించనివారి మంచినీటి కుళాయి కనెక్షన్‌లను తొలగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు, సహాయ కమిషనర్ కనకమహాలక్ష్మి, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, మున్సిపల్ అసిస్టెంట్ సిటీప్లానర్ వి.శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.