విజయనగరం

అన్ని శాఖల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 23: జిల్లాలో అన్ని శాఖల్లోను సిబ్బందికి ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వివిధ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ స్థాయి కార్యాలయాలతోపాటు మండల స్థాయి కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలన్నారు. బయోమెట్రిక్ విధానంలో రిజిస్టర్ అయిన సిబ్బంది కూడా ఆ విధంగా హాజరు నమోదు చేయకపోవడంపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఇ-ఆఫీసు విధానం ప్రవేశపెట్టినప్పటికీ వివిధ శాఖలు ఇ-ఆఫీసు విధానంలో ఫైళ్లను నిర్వహించడం లేదన్నారు. ఇదిలా ఉండగా మరికొందరు ఇ-ఆఫీసు విధానంలో ఫైళ్లను పంపినప్పటికీ వాటిని క్లోజ్ చేయకపోవడం వల్ల అవి పెండింగ్‌లో చూపుతున్నాయన్నారు. ఇ-ఆఫీసు విధానంలోనే ఫైళ్లను క్లోజ్ చేయాలన్నారు.
ఆరోగ్యరక్షలో అర్హులను చేర్పించాలి
ఆరోగ్య రక్ష పథకంలో అర్హులను చేర్పించాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న అర్హులైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరు రూ.1200 వార్షిక ప్రీమియం చెల్లించి ఆరోగ్య రక్ష పథకంలో చేరాలని సూచించారు. ఏప్రిల్ 6 వరకు పధకంలో చేరేందుకు గడువు ఉందన్నారు. ఆరోగ్య రక్షలో చేరిన లబ్ధిదారులకు 440 ప్రభుత్వ, కార్పొరేట్, నెట్‌వర్క్ ఆసుపత్రులలోను 1044 వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్యం అందజేస్తారన్నారు. రోగి ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి పూర్తిగా కోలుకునే వరకు ఉచిత వైద్య సేవలు, మందులు, పోషకాహారాన్ని అందిస్తారని వివరించారు.
ఒడిఎఫ్‌కు ప్రణాళికలు
జిల్లాలో వంద గంటల్లో 20వేల మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద 39 గ్రామాలు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 82 గ్రామాలను ఎంపిక చేయాలన్నారు. అందుకు సంబంధించి లబ్ధిదారుల ప్యూరిఫికేషన్, డేటా తదితర వివరాలు అప్‌లోడ్ చేయాలన్నారు. ప్రతి మండలంలో ఇద్దరు మేస్ర్తిలకు ఈ నెల 27, 28 తేదీల్లో మాస్టర్ శిక్షణను ఇప్పించాలన్నారు. ఈ సమావేశంలో జెసి లఠ్కర్, డిఆర్వో జితేంద్ర, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ ఉషశ్రీ, కోఆర్డినేటర్ సాయిరాం, జెడ్పీ సిఇఒ రాజకుమారి, డిఆర్‌డిఎ పిడి డిల్లీరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.