విజయనగరం

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(పూల్‌బాగ్), మార్చి 24: దివ్యాంగుల కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని క్రియేట్ ప్రాజెక్టు సిఇఓ తాళాడ దీప్తి అన్నారు. శుక్రవారం మండలంలోని చెల్లూరు లెప్రసీ మిషన్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి కుష్టువ్యాధి గ్రస్తుల అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకోవడమే కాకుండా, ఇతర పథకాలకు కూడా సకాలంలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. కుష్టువ్యాధి గ్రస్తులు కేవలం యాచనకు పరిమితం కాకూడదని అన్నారు. వారు ఈ వృత్తి నుండి బయటకు వచ్చేందుకు క్రియేట్ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు అప్పలనాయుడు, ప్రతినిధులు, వ్యాధి గ్రస్తులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 10న సామూహిక వటపత్ర సాయి వ్రతాలు

విజయనగరం(పూల్‌బాగ్), మార్చి 24: పట్టణంలోని కొత్తపేటలో ఉన్న మన్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో ఏప్రిల్ 10వ తేదీన సామూహిక వటపత్ర సాయి వ్రతాలతోపాటు సత్యనారాయణ స్వామి వ్రతాలను కూడా ఆలయ అభివృద్ధికమిటీ సభ్యులు ఎంతోప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని ఆలయ ఇఓ రమణ అన్నారు. శుక్రవారం ఆలయంలో ఆ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ కార్యక్రమ నిర్వహణకు అయ్యే 15లక్షల రూపాయలను ఆలయ అభివృద్ధి కమిటీ భరిస్తుందని చెప్పారు. ఉత్సవ కార్యనిర్వాహకుడు అవనాపు శివప్రసాద్ మాట్లాడుతూ 1008 మందిదంపతులు ఈ వ్రతంలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వ్రతంలో పాల్గొనే వారికి కలశం, చీర, పూజా సామాగ్రీలను సమకూరుస్తామని చెప్పారు. వ్రతాలు అనంతరం సహబంతి భోజనాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ రచయితలు కంది మురళీ నాయుడు, డాక్టర్ సతీష్, బాలబ్రహ్మారెడ్డి, రామలింగస్వామి తదితరులు పాల్గొన్నారు.