విజయనగరం

అంతా రామమయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(పూల్‌బాగ్), ఏప్రిల్ 15: అంతారామమయం జగమంతారామమయం అన్నట్లుగా పట్టణంలోని వాడవాడలా రామాలయాల్లో శ్రీరామనవమివేడుకలు ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా, సంప్రదాయానుసారం వేదమంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. మామిడి తోరణాలతో ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. స్వామి వారి దర్శనార్ధం భక్తులు ఉదయం తొమ్మిది గంటల వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. వేకువజామున సీతారామలక్ష్మణులకు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు. నూతన వస్త్రాలతో సీతారామలక్ష్మణులను అలంకరించారు. స్వామివారికి పానకాన్ని, వడపప్పును నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహించారు. కొత్తపేట కోదండరామాలయం భక్తులతో కోలాహలంగా మారింది. రామాంజనేయులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ సీతారామకళ్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు.కొత్తపేట మండపం సమీపంలో ఉన్న సీతారామాలయం, పుచ్చలవీధి, ఎలుగుబంటివారి వీధి, ఎంజిరోడ్డులోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపి కళ్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. దుప్పాడలోని అష్టలక్ష్మీ రామాలయంలో ఆలయ అర్చకుడు తిరుకళ్యాణస్వామి, సాకేతలు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే స్టేడియం రోడ్డులోని రామమందిరం, పంచముఖ ఆంజనేయస్వామి వారి ఆలయంలోను సీతారామకళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాల్లో భక్తులకు పానకం, వడపప్పులను ప్రసాదంగా పంపిణీ చేసారు. రామాలయాలకు చెందిన ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని తమ గోత్రనామాలతో పూజలు జరిపించుకున్నారు.