విజయనగరం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), మార్చి 26: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయు) రీజనల్ అధ్యక్షుడు బిఎస్ రాములు కోరారు. స్థానిక డిపో ఆవరణలో ఆదివారం జరిగిన రీజనల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో అంగీకరించిన మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్‌ట్యాక్స్‌ను కనీసం పదేళ్లు హాలీడే ప్రకటించాలని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీకి ఇంతవరకు ఉన్న అప్పులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈక్విటీ కింద మార్పు చేయాలని కోరారు. అదేవిధంగా నష్టాల నుంచి బయట పడే వరకూ ప్రతీ ఏటా కొత్త బస్సుల కొనుగోలు కోసం కనీసం 1000 కోట్ల రూపాయలు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆర్టీసీలో డీజిల్‌పై వ్యాట్‌ను ఎయిర్‌వేస్ వలే ప్రస్తుతం ఉన్న దానిని ఒక శాతానికి తగ్గించాలన్నారు. రీజనల్ కార్యదర్శి బిఎ రాజు మాట్లాడుతూ ఆర్టీసీని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా చట్టవ్యతిరేకమైన అక్రమ రవాణాను నియంత్రించాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ డివిజనల్ కె.చంద్రవౌళి, డివిజనల్ కార్యదర్శి డి.శ్రీనివాసరావు, జోనల్ ఉపాధ్యక్షుడు కోరాడ సత్యం, డిపోఅధ్యక్షుడు బిఎస్‌ఎన్‌రాజు, కార్యదర్శి ఎంఇ రావుతదితరులు పాల్గొన్నారు.
కోరం లేక జడ్పీ సమావేశం వాయిదా

విజయనగరం, మార్చి 26: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదాపడింది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా, 11.15 వరకు సభ్యులు రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్టు జెడ్పీ సిఇఒ రాజకుమారి ప్రకటించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి మాట్లాడుతూ వచ్చే నెల 4న స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. వచ్చే నెల 7న సర్వసభ్య సమావేశం ఉంటుందని వివరించారు. అధికారులు అందరు సకాలంలో సమావేశానికి రావడం గమనార్హం.