విజయనగరం

రైతుబజార్లకు త్వరలో సిసి కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 26: జిల్లా కేంద్రమైన విజయనగరంలోని ఆర్ అండ్ బి రైతు బజారుకు కొనుగోలుదారుల తాకిడి పెరగడంతో అక్కడ సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే పొరుగున ఉన్న విశాఖ జిల్లాలోని రైతుబజార్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం విధితమే. తాజాగా ఇక్కడ కూడా కొనుగోలుదారుల సంఖ్య అధికంగా ఉండటంతో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో తొలి విడతగా ఆర్ అండ్ బి రైతుబజారులో 8 సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ లఠ్కర్ వెల్లడించారు. సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల వ్యాపారులకు ఎంతో మేలు కలగనుంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ధరల పట్టికను బోర్డులలో పేర్కొనేవారు. ఇక నుంచి ఎలక్ట్రానిక్ బోర్డులో కూడా కూరగాయల ధరల పట్టికను ప్రదర్శించనున్నారు. దీనివల్ల వినియోగదారులు కూడా నిర్ధేశించిన ధరలకు మాత్రమే వాటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆర్ అండ్ బి రైతు బజారుకు అవసరమైన అన్ని హంగులను ఏ ర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ రైతుబజారుకు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారుల రాక వల్ల వాహనాల పార్కింగ్‌కు కూడా ఇబ్బంది తలెత్తుతోంది. ఇదే సమయంలో ఇటీవల కాలంలో రైతుబజారు రద్దీలో కొంత మంది వినియోగదారులు తమ సెల్‌ఫోన్లను పోగొట్టుకుంటున్నారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఇటువంటి చోరీలను కూడా అరికట్టే అవకాశం ఉంటుంది.