విజయనగరం

సామాజిక న్యాయానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 14: దేశంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు దక్కుతుందని జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి అన్నారు. అంబేద్కర్ 126 జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఇక్కడ ఆనందగజపతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీలను అందరితో సమానంగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారన్నారు. అందులో భాగంగానే వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో వారికి రిజర్వేషన్ సదుపాయం లభించిందన్నారు. నిబంధనల మేరకు ఎస్టీలకు 6 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, 10 శాతం నిధులు కేటాయించామన్నారు. జెడ్పీలో ఏర్పాటు చేసిన 25 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, పంచాయతీరాజ్ మానవ వనరుల కేంద్రాన్ని ఈ నెల 17న నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు ఆమె వెల్లడించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన గొప్ప దార్శనికుడు అంబేద్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగం నిర్మాణంలో కీలకపాత్ర వహించిన డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ పలు దేశాల రాజ్యాంగాల నుంచి ముఖ్య అంశాలను క్రోడీకరించి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించారన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. వసతి గృహాల్లో విద్యార్థులను చదివించడంతోపాటు పోస్టుమెట్రిక్, ప్రిమెట్రిక్ స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నామన్నారు. దాంతోపాటు అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి ద్వారా విద్యార్థులకు విదేశీ విద్యకు పంపిస్తున్నామని వివరించారు. అత్యాచార బాధితులకు రూ.8.25 లక్షల పరిహారాన్ని అందజేశామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భూమి కొనుగోలు చేసి వారికి లబ్ధి చేకూర్చుతున్నామని చెప్పారు. ప్రతి నెల సివిల్ రైట్స్ డే నిర్వహిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఎల్‌కెవి రంగారావు మాట్లాడుతూ అంబేద్కర్‌ను ఏ ఒక్క వర్గానికో పరిమితం చేయరాదన్నారు. అంబేద్కర్ అందరి వాడన్నారు. జాతి కోసం ఆయన అందించిన సేవలు అమోఘమన్నారు. మహిళలకు అందరితో సమాన హక్కులు కల్పించేందుకు, 12 గంటల పనిదినాలను 8 గంటలకు తగ్గించడం, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేశారన్నారు. అదే విధంగా ప్రస్తుతం అందజేస్తున్న ప్రసూతి సెలవులకు ఆధ్యుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని అతిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు చిట్టిబాబు, గండ్రెటి సత్యనారాయణ, జి.శంకరరావు, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆస్తుల పంపిణీ
కార్యక్రమం అనంతరం ఎస్పీ కార్పొరేషన్ ద్వారా రూ.21.62 కోట్ల విలువైన ఆస్తులను 327 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత ఏడాది ఎస్‌ఎస్‌సిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ. జెసి యుసిజి నాగేశ్వరరావు, ఆర్డీవో శ్రీనివాసమూర్తి, ఎస్పీ కార్పొరేషన్ ఇడి ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.