విజయనగరం

పిల్లలను బడిలో చేర్పించాల్సిన బాధ్యత అందరిదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, ఏప్రిల్ 15: బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మండల విద్యాశాఖాధికారి జమ్ము మహాలక్ష్మునాయుడు అన్నారు. ప్రభుత్వం శనివారం నుంచి ఈనెల 22వరకు తలపెట్టిన అమ్మ ఒడి-ప్రభుత్వబడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశాన్ని స్థానిక ఎం ఆర్ సి భవనంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పధకాన్ని విజయవంతం చేయాల్సిన భాద్యత అందరిపైనా ఉందన్నారు. గత ఏడాది నిర్వహించిన బడిబాట కార్యక్రమం నిర్వహించి విజయవంతమైందని, ఈ ఏడాది కూడా అందరూ కష్టపడి విజయవంతం చేయాలని కోరారు. 18నుంచి 20 వరకు ర్యాలీలు నిర్వహించి, అడ్మిషన్ పత్రాలు పొందాలన్నారు. 22న బడిలో చేరిన పిల్లలకు, తల్లిదండ్రులకు అభినందన సభ నిర్వహించడంతో కార్యక్రమం ముగుస్తుందన్నారు. సమావేశంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మీసాల అప్పలనాయుడు, వి రవీంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.
17నుంచి పంచాయతీ వారోత్సవాలు
చీపురుపల్లి, ఏప్రిల్ 15: పంచాయితీ వారోత్సవాలు ఈనెల 17నుంచి నిర్వహించనున్నట్లు మండల ప్రత్యేక అధికారి, ఆర్డీ ఓ శ్రీనివాసమూర్తి తెలిపారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయితీరాజ్ సంస్థలు ప్రజలకు అతి చేరువలో ఉన్న స్థానిక ప్రభుత్వాలని, ప్రజా అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడంలో అధికారులు ముందుండాలని తెలిపారు. 1993 ఏప్రిల్ 24న దేశంలో పంచాయితీ రాజ్ వ్యవస్థలు రాజ్యాంగబద్దంగా అమలులోకి వచ్చినట్టు వివరించారు.

ఈనెల 24న అన్ని గ్రామ పంచాయితీల్లో జాతీయ పంచాయితీ దినోత్సవాన్ని నిర్వహించాలని కోరారు. వారోత్సవాల్లో భాగంగా గ్రామ సభలు నిర్వహించాని సూచించారు. అలాగే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని సమీక్షించారు. 17నుంచి మండలంలోని పర్ల, కరకాం, గొల్లలములగాం, నిమ్మలవలస గ్రామాల్లో 200 గంటల్లో ఐ ఎస్ ఎల్ నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎంపిడీ ఓ ఎస్ ఇందిరారమణ, తహాసీల్దార్ గోవిందరావు, ఆర్ డబ్లూ ఎస్ జె ఈ రమేష్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల పరిశీలన
చీపురుపల్లి, ఏప్రిల్ 15: మండలంలో జరుగుతున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను వెలుగు జిల్లా అధికారి జె శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు. మండలంలోని గచ్చలవలస, సంకుపాలెం గ్రామాల్లో జరుగుతున్న వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణ పనులకు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తి గత మరుగుదొడ్డి నిర్మించే వారికి ఇచ్చే ప్రోత్సాహాకాల్లో బకాయిలు ఉంటే వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా చూడాలని నిర్మాణదారులకు సూచించారు. పర్యటనలో మండల వెలుగు అధికారి వై ఎర్రినాయుడు, మోటివేటర్ ఈశ్వరమ్మ తదితరులు ఉన్నారు.