విజయనగరం

650 కుటుంబాలకు ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, ఏప్రిల్ 15: జిల్లాలో 650 కుటుంబాలకు ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నది జిల్లా కో- ఆర్డినేటర్ కె.పి.సి.వి. సాయి అన్నారు. శనివారం స్థానిక మిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలను జిల్లా కో- ఆర్డినేటర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యరక్ష పథకం 650 కుటుంబాలు చేరాయన్నారు. అలాగే ఎటువంటి వైద్య ఆరోగ్య పథకాలు అందని కుటుంబాలు చేరాయని అన్నారు. అంతేకాకుండా ఆరోగ్య రక్ష పథకం ద్వారా ఇద్దరు రోగులు గుండె సంబంధిత వ్యాధితో జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు అందుతున్నాయని అన్నారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న వైద్య సేవలు ఆరోగ్య రక్షలో పొందవచ్చని చెప్పారు. అలాగే రోగులకు పథకం ద్వారా ఎసి సౌకర్యం కల్పిస్తామని అన్నారు. పిహెచ్‌సిల్లో ఇహెచ్‌సి, ఇఎస్‌ఐ, ఆరోగ్య రక్ష వైద్య సేవలందిస్తున్నామని తెలిపారు. సేవల్లో ఇబ్బందులు ఉంటే 333814021,22,58 నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
చెన్నైలో వలస కూలీ మృతి
దత్తిరాజేరు, ఏప్రిల్ 15: మండలంలోని పెదమానాపురం గ్రామానికి చెందిన పులుసు అప్పారావు(30) బతుకు తెరువుకోసం చెన్నై వలస వెళ్లి శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. అప్పారావు ఈ ఏడాది సంక్రాంతి తరువాత ఉపాధి కోసం చెన్నై వెళ్లాడు. అక్కడ శుక్రవారం మధ్యాహ్నం తీవ్రంగా కడుపునొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోవడంతో అకస్మాత్తుగా మృతి చెందాడు. మృతి చెందిన వార్త కుటుంబీకులకు తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతని భార్య సత్యవతి, బాబు లోకేష్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృత దేహం కోసం ఆయన కుటుంబ సభ్యులు చెన్నై బయలుదేరి వెళ్లారు. ఇక్కడ కుటుంబ సభ్యులు మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు.
అమ్మవడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
ఎల్.కోట, ఏప్రిల్ 15: అమ్మవడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎల్.కోట ఎంఇఓ సి.హెచ్.కూర్మారావు శనివారం మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలను పాఠశాలల్లో తప్పనిసరిగా చేరే విధంగా కృషి చేయాలని తద్వారా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విధిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. ఏ ఒక్క పిల్లవాడు కూడా చదువుకోకుండా ఉండకూడదని దానికి అందరు కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.