విజయనగరం

వైకాపాను బలోపేతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 15: వైకాపాను బలోపేతం చేయాలని ఉత్తరాంధ్ర వైకాపా కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. శనివారం ఎల్‌కోట మండలానికి పార్టీ అధ్యక్షునిగా నియమితులైన గమ్మిడి సత్యనారాయణ కోలగట్లను, జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు బెల్లాన మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యోన్ముఖులు కావాలన్నారు. పార్టీని ప్రతి గ్రామంలో పటిష్టం చేయాలన్నారు. దీనిపై సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తిస్థాయిలో పార్టీని పటిష్టం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు బంగారునాయుడు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
మున్సిపల్ విద్యార్థులకు గుణాత్మక విద్య
విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 15: మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. దీనిలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని మున్సిపల్ పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమంతోపాటు డిజిటల్ తరగతి గదులను నిర్వహణ చేపట్టిందని చెప్పారు. విద్యార్ధులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు గణితం, సైన్సు, భాషా ప్రయోగ శాలలు, మెరుగైన అన్ని రకాల వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు చేపట్టిందని అన్నారు. పట్టణంలో కస్పా మున్సిపల్ హైస్కూల్‌లో శనివారం మధ్యాహ్నం పేదరిక నిర్మూలనలో విద్యపాత్రపై అవగాహన సదస్సును నిర్వహించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో మున్సిపల్ కమిషనర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని, కెరీర్ ఫౌండేషన్ కోర్సు (సిఎఫ్‌సి), అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్సు (ఎఎఫ్‌సి)ను ప్రారంభించి పేద విద్యార్ధులకు విద్యతోపాటు జాతీయస్థాయి పోటీ పరీక్షలలో కూడా పాల్గొనేవిధంగా ప్రభుత్వం గుణాత్మక విద్యను అందించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. అందువల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లల విద్య కోసం అప్పులు చేసి ప్రైవేటు పాఠశాలలో చేర్పించకుండా అన్ని వసతులు ఉన్న మున్సిపల్ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ సమావేశంలో మెప్మా ప్రాజెక్టుడైరెక్టర్ మీసాల లక్ష్మునాయుడు, కస్పా, కంటోనె్మంట్ మున్సిపల్ హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులు వై.అప్పలనాయుడు, రామారావు, కెరీర్ ఫౌండేషన్ కోర్సు జిల్లా కన్వీనర్ బి.హరీష్, మెప్మా కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు గేదెల రాము, దన్నాన గోవిందరావుతదితరులు పాల్గొన్నారు.