విజయనగరం

రేపటి నుంచి పంచాయతీ దినోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 15: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17 నుంచి వారం రోజులపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహోత్సవాలను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. జిల్లాలో కూడా ఈ ఉత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్ నుంచి మండలాల ఎంపిడిఒలు, ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సభలు నిర్వహించి 2014-17 వరకు గ్రామ పంచాయతీల్లో సాధించిన ప్రగతి నివేదికలను ప్రదర్శించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర వాటికి ఎంతెంత ఖర్చు చేసినది గోడలపై రాయించాలన్నారు. గ్రామాల్లో చేపట్టిన ఉపాధి పనులు, వాటర్‌షెడ్ పనుల వివరాలను తెలిసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సర వార్షిక ప్రణాళికను కూడా గ్రామసభలో ప్రదర్శించాలన్నారు. గ్రామ సభ నిర్వహించిన రోజున స్వయంశక్తి సంఘాలు, యువత, విద్యార్థులు, జన్మభూమి కమిటీలు, పంచాయతీ సభ్యులు తదితరులందరితో ర్యాలీలు నిర్వహించాలన్నారు. గ్రామసభ నిర్వహణ, ఉత్సవాల నిర్వాహణకు ఒక్కొ గ్రామ పంచాయతీకి రూ.10వేలు మంజూరు చేస్తారని తెలిపారు. జిల్లాలో గత మూడేళ్లలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా స్థాయిలో ఒక బ్రోచర్‌ను రూపొందిస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు.

జిల్లా స్థాయి ఉత్సవాన్ని ఈ నెల 24న నిర్వహిస్తామన్నారు.
18నుంచి 20వేల మరుగుదొడ్ల నిర్మాణం
ఈ నెల 18న జిల్లాలో 20వేల మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వీటిని 200 గంటల్లో పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన సామాగ్రిని ముందుగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ఒక్కొ మండలంలో నాలుగు గ్రామాలను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా సిమెంట్ కొరత, బ్యాంకుల్లో నగదు కొరత సమస్యలు ఉన్నాయని ఎంపిడిఒలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డ్వామా పిడి ప్రశాంతి, జెడ్పి సిఇఒ రాజకుమారి, డిపిఒ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.