విజయనగరం

బీమా క్లైయింలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 15: జిల్లాలో చంద్రన్న బీమా క్లైయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆదేశించారు. శనివారం మధ్యాహ్నాం తన కార్యాలయంలో డిఆర్‌డిఎ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు అధికారులతో చంద్రన్నబీమా అమలుతీరుపై సమీక్ష జరిపారు. ప్రస్తుతం జిల్లాలో 9.64 లక్షల మంది సభ్యులు ఈ పధకంలో చేరారని డిఆర్‌డిఎ అధికారులు వివరించారు. మృతుల కుటుంబాలకు మరణ ధ్రువీకరణ పత్రాలను త్వరగా జారీ చేయాలన్నారు. అలాగే మరణించిన వారం రోజుల్లోగా క్లైయిమ్‌ల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ పధకంలో చేరిన సభ్యులకు 18-50 ఏళ్ల వయస్సు కలిగిన చంద్రన్న బీమా పాలసీదారు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగిన రూ.5 లక్షలు, తాత్కాలిక అంగవైకల్యానికి రూ.3.65 లక్షలు, సాధారణ మరణానికి రూ.30వేలు చెల్లిస్తారన్నారు. 60-70ఏళ్ల వయసు కలిగిన పాలసీదారులు ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత అంగవైకల్యానికి గురైన రూ.4.25 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.3.25 లక్షలు చెల్లిస్తామని డిఆర్‌డిఎ ఇన్‌ఛార్జి పిడి రాజకుమారి వెల్లడించారు. ఈ సమావేశంలో ఒఎస్‌డి అప్పలనాయుడు, డిసిహెచ్‌ఎస్ ఉషశ్రీ, డిపిఒ సత్యనారాయణ, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ రాఘవరావు, డిపిఎం రాజ్యలక్ష్మి, సిఐ పైడయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రి స్థలం మాన్సాస్‌కు అప్పగింత?

విజయనగరం, ఏప్రిల్ 15: జిల్లా కేంద్ర ఆసుపత్రి కోసం కేటాయించిన స్థలంలో రైతుబజారు నిర్వహించడం పట్ల మాన్సాస్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. పట్టణంలోని ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచి సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఆసుపత్రి కోసం నిర్వహించాలని అప్పట్లో స్పష్టం చేశారు. తొలుత జిల్లా కేంద్ర ఆసుపత్రిని అక్కడ నిర్వహించినప్పటికీ, ఆ తరువాత వేరొక ప్రాంతానికి మార్పు చేయడంతో ఈ స్థలం వృథాగా పడి ఉండటంతో ఇక్కడ రైతుబజారుకు ఆ స్థలాన్ని కేటాయించారు. గత దశాబ్ధకాలంగా అక్కడ రైతు బజారు నిర్వహిస్తున్నారు. కాగా, ఆసుపత్రికి కేటాయించిన స్థలాన్ని రైతుబజారుగా వినియోగించడం పట్ల మాన్సాస్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆసుపత్రికి కేటాయించిన స్థలాన్ని అదే ప్రయోజనం కోసం వినియోగించాలని లేనిచో ఆ స్థలాన్ని వెనక్కి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. దీంతో మహారాజ రైతుబజారును అక్కడ నుంచి తరలించే యోచనలో అధికారులు ఉన్నారు. ఇందుకు సరిపడా స్ధలం సమీపంలో లభ్యం గాకపోవడంతో సిఎంఆర్ ఎదురుగా ఉన్న పెద్ద చెరువును ఆక్రమించి చెరువును చదును చేస్తున్నారు. రైతుబజారును అక్కడకు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మరి కొద్ది రోజుల్లో రైతుబజారు వేరొక ప్రాంతానికి తరలిపోనుంది. కాగా, దీనిపై అధికారులు ఎవరు నోరు మెదపడం లేదు. జిల్లా ఆసుపత్రికి కేటాయించిన స్థలాన్ని తిరిగి మాన్సాస్‌కు అప్పగించేందుకు అధికారులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం.
జిల్లాలో 18 హాస్టళ్ల మూసివేత

జామి, ఏప్రిల్ 15: జిల్లాలో 18 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఎత్తివేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు సంబంధిత వసతి గృహాల సంక్షేమ అకారులకు ఉత్తర్వులు జారీ చేశారు. దశల వారీగా వసతి గృహాలు మూసివేతలో భాగంగా 3వ దశలో బలిజిపేట, బొబ్బిలి, ధర్మవరం, బిఎల్ పురం, పాచిపెంట, శంబర, కొత్తవలస, విజయనగరం, బి.జె.పురం, మారిపివలస, జామి, వియ్యంపేట, సాలూరు వసతి గృహాలను మూసివేస్తున్నారు. ఈ వసతి గృహాల్లో 540 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. వీరందరికి సంబంధిత సమీప గురుకుల పాఠశాలలకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. హాస్టళ్ల మూసివేతపై అనేకమంది విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలు సుదూర ప్రాంతాలకు తరలించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.