విజయనగరం

పథకాల అమల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 29: పథకాల అమల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నాం ఆయన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెర్లాం, జియ్యమ్మవలస మండలాల్లో జీరో పనిదినాలు ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌టిఆర్ గ్రామీణ గృహ నిర్మాణాల్లో ఉపాధి హామీ కింద 90 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. అదే విధంగా లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యం పట్ల గృహనిర్మాణ ఇంజనీర్లను నిలదీశారు. ప్రతి వారం గృహనిర్మాణాలకు సంబంధించి మస్టర్లు వేసి బిల్లులు చెల్లించాలన్నారు. ఉపాధి హామీ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వర్మికంపోస్టు, ఊరికో ఉద్యానవనం, క్రీడా మైదానాల అభివృద్ధి, చెక్‌డ్యాం నిర్మాణ పనులు, చెరువుల్లో పూడికతీత, నీరు ప్రగతి పనులు పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు.
ఇదిలా ఉండగా ప్రతి నియోజకవర్గానికి ఒక క్రీడా మైదానం ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ వెల్లడించారు. ఒక్కొ క్రీడా మైదానానికి రూ.2కోట్ల వ్యయంతో జిల్లాలో 9 క్రీడామైదానాలు నిర్మించనున్నట్టు తెలిపారు. చిట్టి గురువులు, నీరు చెట్టు, ఐఎస్‌ఎల్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో 14వేల పింఛనుదారులు ఉన్నారని వారికి ఆధార్ అనుసంధానం చేసి ఆదార్ నంబర్లు సరిచేయాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పి సిఇఒ రాజకుమారి, డ్వామా పిడి ప్రశాంతి, డిపిఒ సత్యనారాయణ, ఉద్యానశాఖ డిడి లక్ష్మినారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రమణమూర్తి పాల్గొన్నారు.