విజయనగరం

నీరు ప్రగతితో కరవు నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 29: జిల్లాలో నీరు ప్రగతి కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా శాశ్వత కరవు నివారణ చేయవచ్చని రాష్ట్ర గనులు, భూగర్భజలాలశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. శనివారం ఇక్కడ ఆనందగజపతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నప్పటికీ నీరు-ప్రగతి కింద ఎంత మొత్తం నిధులు ఖర్చయినా భరిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నారు. చెరువులలో పూడికతీత పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాది చేపట్టిన కార్యక్రమాల వల్ల భూగర్భజలాలు పెరిగాయన్నారు. రూ.10 కోట్లతో రెండువేల చెక్‌డ్యామ్‌లు, జలవనరుల శాఖ ద్వారా 920 చెక్‌డ్యామ్‌లు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, ఎమ్మెల్సీలు డి.జగదీష్, సంధ్యారాణి, ఎమ్మెల్యేలు మీసాల గీత, బొబ్బిలి చిరంజీవులు, డాక్టర్ కెఎ నాయుడు, మున్సిపల్ చైర్‌పర్సన్ డి.శ్రీదేవి, విజయనగరం ఎంపిపి ధనలక్ష్మి, డ్వామా పిడి ప్రశాంతి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రమణమూర్తి, తోటపల్లి ఎస్‌ఇ తిరుమలరావు, పంచాయతీరాజ్ ఎస్‌ఇ వేణుగోపాల్, చిన్నతరహా నీటిపారుదలశాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

అక్రమ మద్యం స్వాధీనం
పార్వతీపురం (రూరల్), ఏప్రిల్ 29: మండలంలోని వెంకంపేట గ్రామంలో రూరల్ పోలీసులు భారీగా అక్రమ మద్యం నిల్వలు కనుగొన్నారు. వెంకంపేటలో భారీగా అక్రమ మద్యం నిల్వలున్నాయన్న సమాచారం అందుకొన్న ఆయన తన సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలోని ఓ ఇంటిలో నిల్వ ఉంచిన దాదాపు రూ. 6లక్షల విలువైన 8,861 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై యు మహేష్ తెలిపారు. లైసెన్స్‌లు లేకుండా మద్యం బాటిళ్లు నిల్వ ఉంచిన ఇద్దర్ని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశామన్నారు. సీజ్ చేసిన మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులకు అప్పగించామని ఎస్సై తెలిపారు. మండలంలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.