విజయనగరం

ఒత్తిళ్లకు లొంగారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, ఏప్రిల్ 29: మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజుదేవ్‌కు ఎస్టీ కులధ్రువీకరణ పత్రాన్ని సమర్చించడం ద్వారా జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించారని ఎమ్మెల్యే రాజన్నదొర ఆరోపించారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజుదేవ్ కులనిర్ధారణ విషయంలో చట్టాలకు అనుగుణంగా కలెక్టర్ వ్యవహరించ లేదన్నారు. కొంతమంది ప్రభుత్వ, పెద్దల, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి భంజుదేవ్‌కు అనుకూలంగా నివేదికలు ఇచ్చారన్నారు. సబ్ కలెక్టర్ శే్వతామహంతి ఇచ్చిన కులధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్ వివేక్‌యాదవ్ సమర్పించడం అన్యాయమన్నారు. ఎందుకు సమర్పించారో తమ నివేదికలో స్పష్టం చేయలేదన్నారు. ఐటిడిఏ పిఓ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల జిల్లా పరిశీలక కమిటీ ఇచ్చిన నివేదికను కాదని భంజుదేవ్ గిరిజనుడేనని ప్రకటించడం దారుణమన్నారు. 109 పేజీల నివేదిక కలెక్టర్ స్వయంగా రాసింది కాదన్నారు. ఎవరో స్క్రిప్టులు రాసి ఇస్తే దానిపై సంతకం చేసి ఇచ్చినట్లు ఉందన్నారు. జిల్లాస్థాయి కమిటీ నివేదికలను ప్రక్కన పెట్టడం 1993 ఎస్సీ, ఎస్టీ,బి.సి. చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘించి కోర్టు దిక్కారణకు పాల్పడ్డారన్నారు. భంజుదేవ్ సోదరుడు ఏ.పి.్భంజుదేవ్ గిరిజనుడేనని సుప్రీంకోర్టు ఎక్కడా తీర్పు ఇవ్వలేదన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తు చట్టాలను అమలు చేయాల్సిన జిల్లా కలెక్టర్ తమస్థాయిని దిగజార్చుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొండరాజు కులం ఎక్కడ ఉందో కలెక్టర్‌స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 33 కులాల ఎస్టీ జాబితాలో కొండరాజుఅనే కులం లేదన్నారు. మున్సిపల్ రికార్డులు, భూమి క్రయ, విక్రయాలు, పాఠశాల రికార్డులలో భంజుదేవ్ కుటుంబీకుల కులం ఒరియా క్షత్రియ అని ఉందన్నారు. 1993 నుంచి రికార్డులను పరిశీలిస్తే క్షత్రియ అని ఉందనానరు. ఆర్.పి.్భంజుదేవ్‌తో సహా ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెళ్లకు సంబంధించిన రికార్డులలో కూడా క్షత్రియ అని పేర్కొని ఉందన్నారు. అన్ని రికార్డులలో క్షత్రియ అని కులం ఉంటే గిరిజన కులానికి చెందిన వారని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. అధికారం, పలుకబడి ఉన్నంతమాత్రాన దొంగ గిరిజనులకు గిరిజన దృవీకరణ పత్రాలను జారీచేయడం అన్యాయమన్నారు. భంజుదేవ్ గిరిజనుడు కాదని, తాను చూపించిన ఆదారాల గురించి, వాదనల గురించి కలెక్టర్ తమ నివేదికలు ఎక్కడా వివరణ ఇవ్వలేదన్నారు. రాజకీయ ఒత్తిళ్లమేరకు తప్పుడు నిర్ధారణలు చేశారన్నారు. దీనిపై జిల్లాలోని గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరారు. నకిలీ గిరిజనులపై తన పోరాటం కొనసాగుతుందని రాజన్నదొర అన్నారు. ఈ సమావేశంలో మండల వై.సి.పి. అధ్యక్షులు సువ్వాడ రమణ, పట్టణ వై.సి.పి. అధ్యక్షులు జి.సూరిబాబు, వై.సి.పి. నాయకులు దాలినాయుడు, రిపబ్లిక్ పార్టీ నాయకులు ప్రకాషరావు, తదితరులు పాల్గొన్నారు.