విజయనగరం

కరువు, మంచినీటి సమస్యలపై ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), మే 2: జిల్లాలో కరువు, మంచినీటి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం పార్టీ కార్యాలయం ఎల్‌బిజి భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రెడ్డి శంకరరావుతో కలిసి మాట్లాడుతూ గత ఏడాది మూడు మండలాల్లో కరువు నెలకొందని, ఈ ఏడాది ఆరు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించినా కరువు నివారణ చర్యలు సమర్ధవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆవేదన వ్యక్తం చేసారు. కరువు ప్రభావిత మండలాల్లో ఇన్‌పుట్ సబ్సిడి రైతులకు అరకొరగా అందచేసారని విమర్శించారు. వడదెబ్బకు పలువురు జిల్లాలో చని పోతున్నారని నివారణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. వేసవిలో పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో కేడా తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని నిధులు ఉండి కూడా తక్షణ ఏర్పాట్లు చేయలేదని ఆందోళన ధ్వజమెత్తారు. పట్టణంలో కోటి రూపాయలు ఇందుకు కేటాయించారని ఒక్క బోరుకూడా తీయలేదని విమర్శించారు. ఇంటింట కుళాయి ఎక్కడ అమలు చేస్తున్నారని ప్రశ్నించారు.ఉపాధి హామీ పధకం కింద పనులు వంద రోజులు జాబ్ కార్డు ఉన్నవారికి కల్పించలేని స్ధితిలో జిల్లా యంత్రాగం ఉందని ఆరోపించారు.110 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో నెలకొన్న ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 5న మండల కేంద్రాలు, పట్టణాల్లో ఆందోళనలు చేపట్టనున్నామని తెలిపారు.

మురికి నీరుతో అవస్ధలు

విజయనగరం(టౌన్), మే 2: పట్టణంలోని ఆర్ అండ్ బి రైతు బజారునుండి అయ్యన్నపేట వెళ్లే ప్రధానరహదారిలో మురికి నీరు ప్రజలకు అవస్ధలకు గురిచేస్తోంది. సమీపంలోని అపార్టుమెంట్ల నుండి వాడుక నీరు పోయేందుకు సరైన మార్గంలేక వెనక్కి వచ్చి అయ్యన్నపేటకు- ఇటు జిల్లా కేంద్ర ఆసుపత్రికి వెళ్లే కూడలి వద్ద మడుగులా చేరుతోంది. గత మూడు రోజులుగా ఇక్కడ ఇదే పరిస్ధితి నెలకొంది. దీంతో ఈ రహదారిమీదుగా రాకపోకలు సాగించే పట్టణ వాసులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. వాడుక నీరు పోయే మార్గం లేకపోవడంతోనీరు చేరి చెరువును తలపిస్తోంది. దీంతో మురికి వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పురపాలక సంఘ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.