విజయనగరం

నెలరోజుల్లో పందుల నిర్మూలన: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 2: జిల్లా కేంద్రంలో పందులను పూర్తిగా నిర్మూలించేందుకు ఈనెలాఖరు వరకు గడువు విధించినట్టు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ స్పష్టం చేశారు. ప్రజారోగ్యానికి పెద్ద బెడదగా తయారైన పందులన్నింటిని నిర్మూలించాలన్నారు. మంగళవారం ఆయన తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో పందుల నిర్మూలనకు తగినంతమంది షూటర్లు లేనట్టయితే ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాలన్నారు. కాగా, పందుల నిర్మూలనకు మున్సిపాలిటీ పరంగా చేపట్టిన అంశాలను కలెక్టర్‌కు కమిషనర్ నాగరాజు వివరించారు. పందుల నిర్మూలనలో భాగంగా సుమారు 450 పందులను తొలగించామని, మిగిలిన వాటిని కూడా తొలగించే పనిలో ఉన్నామన్నారు. పందుల నిర్మూలనలో ఎవరైనా అడ్డుతగిలితే వారిపై పోలీసు కేసు నమోదు చేయాలన్నారు. పందుల సంచారం వల్ల పట్టణానికి చెడ్డపేరు వస్తుందని, ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. దాంతోపాటు పారిశుద్ధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. జూన్ ఒకటో తేదీ నాటికి పట్టణంలో పందుల సంచారం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చేపట్టే పనులకు రెవెన్యూ, పోలీసు, పశుసంవర్ధక శాఖలు సహకరించాలన్నారు. ఆయా శాఖల ప్రతినిధులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. పందుల పెంపకందారులకు వ్యక్తిగత నోటీసులు ఇవ్వడంతోపాటు పబ్లిక్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పందుల నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం జిఒ జారీ చేసినందున ఈ మేరకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని పశుసంవర్థకశాఖ జెడి సింహాచలంను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, డిఎస్పీ ఎవి రమణ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.