విజయనగరం

ప్రాజెక్టులు చేపట్టాలని ఉందా? లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 10: జిల్లాలో ప్రాజెక్టులు చేపట్టాలని ఉందా? లేదా? రూ.7 కోట్ల ప్రాజెక్టుకు ఇనే్నళ్లా? రిజర్వాయరు మీద ఉన్న ప్రేమ కాలువల మీద లేదు అంటూ శాసనసభ హామీల అమలు కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేష్ ఇంజనీరింగ్ ఎస్‌ఇని నిలదీశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో శాసనసభ హామీల కమిటీ సమీక్ష సమావేశం జరిగింది.కాగా, శాసనసభ సభ్యులు ఇచ్చిన హామీలలో ఏయే కార్యక్రమాలు ఎంత వరకు పూర్తి చేశారో కమిటీ ఆరా తీసింది. జిల్లాలో రూ.7 కోట్లతో నిర్మించతలపెట్టిన అడారిగెడ్డ ప్రాజెక్టు 12 ఏళ్లు గడచినా పూర్తి కాలేదా అని ప్రశ్నించారు. దీనిపై ఎస్‌ఇ మాట్లాడుతూ 2005లో ఈ ప్రాజెక్టు ప్రారంభించేందుకు అనుమతి లభించిందన్నారు. అయితే అప్పట్లో రూ.4.1 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టామని, నేడు అది రూ.5.25 కోట్లకు పెరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 73.38 ఎకరాలకు సాగునీరందించేందుకు ఉద్దేశించిందని వివరించారు. దీనిపై కమిటీ సభ్యులు పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ నీరు-చెట్టు కింద కాలువలు పూర్తి చేసే అవకాశం ఉంది కదా అని ప్రశ్నించారు. దీనిపై ఎస్‌ఇ నోరు మెదపలేదు. అనంతరం వైద్యఆరోగ్యశాఖలో అన్ని సిహెచ్‌సిలకు వైద్యులు అందుబాటులో ఉంటున్నారా అని ప్రశ్నించారు. భద్రగిరిలో తప్ప మిగతా చోట్ల వైద్యులు ఉన్నారని తెలిపారు. భూ ఆక్రమణల గురించి ప్రస్తావించగా నెల్లిమర్లలో ఐదు ఎకరాల భూమిని ఓ ఆసామి ఆక్రమించుకున్నాడని తెలిపారు. అయితే జిల్లా కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. కాగా, ఆ ఆసామి హైకోర్టును ఆశ్రయించారని నెల్లిమర్ల తహశీల్దార్ చిన్నారావు తెలిపారు. అక్కడ సెక్షన్ 145 అమలు చేసినట్టు అధికారులు తెలుపగా అలా చేయవద్దని చైర్మన్ వెంకటేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
రుణమాఫీ మాటేమిటి?
జిల్లాలో 2015లో కరవు మండలాలుగా గుర్తించిన సీతానగరం, బొబ్బిలి, పాచిపెంట మండలాల రైతులకు నేటి వరకు పరిహారం అందకపోవడం పట్ల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై వ్యవసాయశాఖ జెడి లీలావతి మాట్లాడుతూ జిల్లాకు రూ.106.29 లక్షలు మంజూరైందన్నారు. మొత్తం 2877 మంది రైతులకుగాను 1100 మంది రైతుల అకౌంట్లు సరిపోలేదన్నారు. మరో 69 మంది రైతులకు బ్యాంకు ఖాతాలు లేవని తెలిపారు. దీనిపై బ్యాంకు ఖాతాలు ప్రారంభించడానికి కూడా మీకు రెండేళ్లు కావాలా అని కమిటీ ప్రశ్నించింది. వీరికి రుణమాఫీ ఎలా చేశారని అడగ్గా ఆ వివరాలు తన వద్ద లేవని జెడి బదులిచ్చారు. మీకు రుణవిమోచన పత్రాలు అందజేయడం మినహా వేరే పని ఏముంది.. ఆ పని కూడా సక్రమంగా చేయలేరా? అని చురకలు వేసింది. దీనిపై పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు మాట్లాడుతూ 2015లో నారాయణపట్నం, మిర్తివలసకు సంబంధించి పంట నష్టపరిహారానికి రూ.25 కోట్లు మంజూరు కాగా, ఆ మొత్తం నేటి వరకు పంపిణీ కాలేదని కమిటీ దృష్టికి తెచ్చారు.
అనంతరం సంగీతకళాశాల గురించి సమీక్షిస్తూ కోర్సులపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఆర్ అండ్ బి అతిథి గృహాలు వాడుకలో ఉన్నాయా? ఏ మేరకు ఉపయోగంలో ఉన్నాయని ఆర్ అండ్ బి ఎస్‌ఇ కాంతిమతిని ప్రశ్నించారు. జాతీయ రహదారి 26 రాయపూర్-విశాఖ నాలుగులైన్ల రహదారి పనులు ఎంత వరకు వచ్చాయని ఎన్‌హెచ్ డిఇ ప్రకాశరావును ప్రశ్నించారు. ఈ సమీక్ష సమావేశంలో కమిటీ సభ్యులు వి.జోగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, జెసిలు శ్రీకేష్, యుసిజి నాగేశ్వరరావు, ఆర్డీవో శ్రీనివాసమూర్తి, జెడి లీలావతి, డిఎంహెచ్‌ఒ డాక్టర్ పద్మజ, సాగునీటిపారుదల శాఖ ఎస్‌ఇ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.