విజయనగరం

నిల్వ జున్ను తిని 8 మంది చిన్నారులకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంట్యాడ, మే 12: ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన జున్ను తిని మండలంలోని జగ్గాపురం గ్రామ పంచాయితీ పరిధిలోని గొర్లిపేట గ్రామానికి చెందిన 8 మంది చిన్నారు. శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. గ్రామానికి చెందిన ఒక మహిళ నిల్వ ఉంచిన జున్ను గ్రామంలో అందరికీ పంచింది. అది తిన్న చిన్నారులు శుక్రవారం ఉదయం వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భయాందోళన చెందిన వారి కుటుంబీకులు అస్వస్థతకు గురైన చిన్నారులను రెండు 108 వాహనాలలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వైద్యులు సకాలంలో స్పందించి చిన్నారులకు చికిత్స అందించడంతో వారికి ప్రాణగండం తప్పింది. సమాచారం అందుకున్న గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ. నాయుడు, జగ్గాపురం గ్రామ పంచాయితీ సర్పంచ్ కొండపల్లి భాస్కరరావు, గంట్యాడ సర్పంచ్ రఘుమండ లక్ష్మి తదితరులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన చిన్నారులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం సమయానికి చిన్నారుల పరిస్థితి మెరుగు పడడంతో వారిని ఆసుపత్రి వర్గాలు డిస్‌చార్జి చేశారు.
గృహ నిర్మాణాల జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

విజయనగరం, మే 12: జిల్లాలో ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకానికి లబ్ధిదారుల ఎంపికలో జాప్యంపై జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గృహనిర్మాణశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుగట్టు, రైల్వే ట్రాక్ పక్కన, గెడ్డల పక్కన ఇళ్లు నిర్మించరాదన్న ఆంక్షలు ఉన్నప్పటికీ అక్కడ ఇళ్లను మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విధంగా మంజూరు చేసిన ప్రతిపాదనలను వెంటనే మార్పు చేయాలన్నారు. విజయనగరం మున్సిపాలిటీలో 4510 ఇళ్లను మంజొరు చేయగా వాటిలో 1450 ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల వద్ద ఆయా ఇళ్లస్థలాలపై హక్కు పత్రాలు ఉన్నప్పటికీ వాటికి కూడా ల్యాండ్ పొజిషన్ సర్ట్ఫికేట్ కావాలంటూ పెండింగ్‌లో ఉంచడం పట్ల డిఇ, జెఇల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో ఆయా లబ్ధిదారులు ఏదైనా ఒక గృహంపై మున్సిపాలిటీకి చెల్లించే ఆస్తిపన్ను రశీదును ఎల్‌పిసిగా భావించి ఇళ్లను మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు లేనివారి పేర్లను జాబితా తయారు చేయాలన్నారు. విజయనగరంలో 4510 ఇళ్లకుగాను 1364, నెల్లిమర్లలో 325 ఇళ్లకుగాను 222, బొబ్బిలిలో 362 ఇళ్లకుగాను 157, పార్వతీపురంలో 836 ఇళ్లకుగాను 149 ఇళ్లు, సాలూరులో 588కిగాను 170 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని గృహనిర్మాణశాఖ పిడి రమణమూర్తి తెలిపారు. ఇదిలా ఉండగా పిఎంఎవై కింద ఇళ్ల స్థలాలు లేని నిరుపేదల కోసం ఇళ్లు నిర్మించి ఇచ్చే పథకానికి విజయనగరం పట్టణంలో 4160 ఇళ్లు మంజూరయ్యాయని వీటిని జి ప్లస్ 3 పథకంలో నిర్మిస్తామని పట్టణ గృహ నిర్మాణ ప్రాంతీయ మేనేజర్ ప్రసాద్ తెలిపారు.