విజయనగరం

ప్రతి ఒక్కరు ధర్మాన్ని ఆచరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, మే 16: ప్రతి ఒక్కరు ధర్మాన్ని పాటించాలని ధర్మ ప్రచారక్ అరుణ అన్నారు. రామతీర్థ దేవస్థానం కల్యాణ మండపంలో సమరత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతులకు నెల్లిమర్ల మండలంతోపాటు చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాలకు చెందిన కన్వీనర్లు, ధర్మ ప్రచారక్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ ధర్మం ఆచరించాలని ప్రతిఒక్కరు ప్రచారం చేయాలన్నారు. ధర్మాన్ని పాటిస్తే సమాజంలో అరాచకాలు, నేరాలు, ఘోరాలు జరిగే అవకాశం ఉండదన్నారు. సమాజం ప్రశాంతతో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో దుర్గా పీఠం అధిపతి సంతానంద, కె.నాగభూషణ రావు, ఫౌండేషన్ ప్రచారకులు వేణుగోపాల్, కన్వీనర్లు పాల్గొన్నారు.

బూత్ కన్వీనర్‌లతో గ్రామాల్లో పార్టీ బలోపేతం
చీపురుపల్లి, మే 16:పంచాయితీ వార్డులు, గ్రామాల్లోను బూత్ కమిటీ కన్వీనర్‌లను నియమించి వారితోనే పార్టీని గ్రామాల్లో మరింత బలోపేతం చేస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు అన్నారు. చీపురుపల్లి మేజర్ పంచాయితీ పరిధిలోని విజయకాలనీ, జి అగ్రహారం తదితర వార్డుల్లో బూత్ కమిటీ కన్వీనర్‌లను జిల్లా పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, సీనియర్ నేత మజ్జి శ్రీనివాసరావుఆదేశాలమేరకు నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ కమిటీ కన్వీనర్‌ల ఆధ్వర్యంలో గ్రామ స్థాయి కమిటీలు పనిచేస్తాయని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎంతో దోహదపడతాయని వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇప్పిలి అనంత్, గవిడి లక్ష్ముంనాయుడు, పీతల మురళీ, ఇతర నాయకులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎల్.కోట, మే 16: మండలంలోని గంగుబూడి జంక్షన్ వద్ద తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రొంగలి కోటేశ్వరరావు (23) వ్యక్తి మరణించాడు. రొంగలి కోటేశ్వరరావు గోపాలపట్నం, సిరిపురపు గోపాల్ వేపగుంట ప్రాంతానికి చెందిన స్నేహితులు. వీరు అరకు బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా గంగుబూడి జంక్షన్ వద్ద బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న కోటేశ్వరరావు తలకు తీవ్రగాయమైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక కూర్చొన్న గోపాల్‌కు గాయాలు కావడంతో 108లో ఆసుపత్రికి తరలించారు. ఎస్సై ఎం.శ్రీనివాస్ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పిల్లలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి
విజయనగరం (టౌన్), మే 16: మున్సిపల్ పార్కులను అభివృద్ధి చేసి పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక పట్టణ అధ్యక్షుడు ఎస్ ప్రసాద్ కోరారు.
మంగళవారం పట్టణ కమిటీ సమావేశాన్ని స్థానిక పించనర్ల సంఘంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు పార్కుల అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భాస్కరరెడ్డి, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.