విజయనగరం

అధికారులపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 16: జిల్లాలోని కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎపి గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం చిన్నపల్లి వీధిలోని సమాఖ్య కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాలైన పాచిపెంట, కొమరాడ, గుమ్మలక్ష్మిపురం, జియ్యమ్మవలస ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఒడిశా నుంచి వస్తున్న పశువులు జిల్లాలో ప్రవేశించకుండా నిరోధించాలని అందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించిన అధికారులు పట్టించుకోలేదన్నారు. పార్వతీపురం డివిజన్‌లో పశువుల అక్రమ రవాణా, కబేళాలు ఎక్కువగా ఉన్నందున డివిజన్, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకొని నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బంగారురాజు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బకు మహిళ మృతి
నెల్లిమర్ల, మే 16: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి గాంధీనగర్ కాలనీకి చెందిన సాజుబిల్లి సూరమ్మ (56) మండలంలోని వడదెబ్బకు మృతి చెందింది. ఈమె ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి కొద్ది సేపటికి ఇంటికి చేరుకునే సమయానికి కుప్పకూలింది. అనంతరం ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఎంత తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈమె మృత్యువాతపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్య బృందం అక్కడకు చేరుకొని సూరమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. వడదెబ్బతో సూరమ్మ మృతి చెందినట్టు ధ్రువీకరించారు.