విజయనగరం

జిల్లా సమస్యలపై చంద్రబాబు వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 16: జిల్లాలో వివిధ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్థానిక ఎమ్మెల్యే మీసాల గీత విన్నవించారు. మంగళవారం ఆమె అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి జిల్లాలో నెలకొన్న సమస్యలపై పేర్కొన్నారు. వాటిలో జ్యూట్ మిల్లులను తెరిపించి కార్మికులను ఆదుకోవాలని, విజయనగరంలో ఆటో నగర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే విజయనగరంలో మంచినీటి సమస్య తీర్చేందుకు గడిగెడ్డ రిజర్వాయరు నుంచి, తాటిపూడి జలాశయం నుంచి మంచినీటిని పంపింగ్ చేసి సరఫరా చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అందజేశారు. ఈమె వెంట మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, ఎమ్మెల్సీ జగదీష్ తదితరులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
విజయనగరం, మే 15: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లాఎస్పీ ఎల్‌కెవి రంగారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం రోడ్డు భద్రత చర్యలపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో కారణాలపై విశే్లషించారు. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను విస్తరించాలని, ఆక్రమణలను తొలగించాలన్నారు. అధికలోడులతో వెళ్లే వాహనాలను సీజ్‌చేయాలన్నారు. ప్రత్యేక దాడులు నిర్వహించేటపుడు ఆర్టీసీ, ఆర్టీవో, పోలీసు అధికారులు కలసి జరపాలన్నారు. జాతీయరహదారులపై ట్రక్‌బేలను మరింతగా విస్తరించాలన్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎక్కువ లైటింగ్ ఉండే విధంగా వీధి దీపాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో ఎజెసి నాగేశ్వరరావు, డిటిసి కృష్ణవేణి, అడిషనల్ ఎస్పీ ఎవి రమణ, ఆర్టీసీ ఆర్‌ఎం అప్పన్న, డిఎస్పీలు పాల్గొన్నారు.

రోగులకు ఏ కష్టం రానివ్వొద్దు: పిఒ
కురుపాం, మే 16: కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు ఎటువంటి కష్టం రానివ్వకుండా వైద్య సిబ్బంది కృషి చేయాలని పార్వతీపురం ఐ.టి.డి.ఏ. పి.ఓ. లక్ష్మీషా కోరారు. మంగళవారం ఆసుపత్రిని పి.ఓ. పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ, ల్యాబ్, ఎక్సరే ప్లాంట్, వార్డులు, మందుల గది, తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులను ప్రేమగా చూసుకోవడం ద్వారా రోగాన్ని తగ్గించేందుకు వైద్యులు కృషి చేయాలన్నారు. ఇటీవల ఆసుపత్రిలో చోటు చేసుకున్న పరిణామాలపై మండిపడ్డారు. ఏదైన అత్యవసర సమయాల్లో ఆదుకున్నప్పుడే సహకరించినవాళ్లమవుతామన్నారు. గిరిజన బాలిక మృతిచెందినప్పుడు వారిని స్వగ్రామానికి పంపించే బాధ్యత వైద్యసిబ్బందిపైనే ఉందన్నారు. రోగుల పట్ల చిరాకుగా మాట్లాడం వంటి చేయకూడదన్నారు. ఆసుపత్రి ఆవరణలో పర్యావరణం కోసం మొక్కల పెంపకానికి, తాగునీటి అవసరాలకు ఎంత ఖర్చు అవుతుందో ప్రతిపాదనలు పంపించాలన్నారు. రోగులకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తాము కృషి చేస్తామని, అందుకు తగిన కావల్సిన అవసరాలను అడగాలన్నారు. దీనికి సంబందించిన ప్రతిపాదనలను పంపించాలన్నారు. ఆసుపత్రిలో ఉన్న అంబులెన్స్‌ను సద్వినియోగపర్చాలని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా మలేరియా అధికారి రవికుమార్ రెడ్డి, వైద్యాధికారి గౌరీశంకరరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.