విజయనగరం

గొల్జాం హై స్కూల్‌ను కమిషనర్ ఆకస్మిక తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్.కోట, జూన్ 13: మండలంలోని గొల్జాం హైస్కూల్‌ను రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కె.సంధ్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్‌లోని అన్ని విభాగాలను తనిఖీ చేసిన కమిషనర్ స్కూల్ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కూల్‌కు అవసరమైన వౌలిక సదుపాయాలతోపాటు పిల్లల చదువుపట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు. శారీరక, మానసిక రుగ్మతలు కలిగిన పిల్లలకు ప్రత్యేక తరగతులు తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. ప్రత్యేక నైపుణ్యాలు నేర్చుకుని అధునాత్మక రీతిలో విద్యను అభ్యసించేందుకు 6వ తరగతి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచాలని సూచించారు. వాటి ద్వారా నైపుణ్యం నేర్పించవచ్చ అని చెప్పారు. ఎలిమెంటరీ స్థాయిలోనే కొన్ని నైపుణ్యాలు నేర్పించాలని, అలా నేర్చుకోని విద్యార్థులను గుర్తించి 50శాతం కంటే తక్కువ గ్రేడింగ్ కలిగినవారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి మెరిట్ విద్యార్థుల స్థాయికి తీసుకురావాలని ఉపాద్యాయులకు సూచించారు. ఇప్పటి నుంచే వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే పదవ తరగతి వారికి సులభంగా ఉండి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారని చెప్పారు. 205కోట్ల రూపాయలతో ఎన్ ఆర్‌ఇఎస్ ద్వారా పాఠశాలల్లో వౌలికసదుపాయాలు కల్పించేందుకు వెచ్చిస్తున్నామని, ఈ డబ్బుతో కాంపౌండ్ వాల్స్, వాటర్ షెడ్, స్కూల్‌రోడ్డు, వంటగదిలు, తరగతి గదులు తదితర నిర్మాణాలు చేపడతామని చెప్పారు. గొల్జాం స్కూల్ ప్రహారీ నిర్మాణానికి కేటాయిస్తామని తెలిపారు. అనంతరం స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి అదే భోజనాన్ని పిల్లలతో కలసి కమిషనర్ భోజనం చేశారు. ప్రభుత్వం ఉచితంగా 33 సైకిళ్ల పంపిణీ చేశారు. పిల్లలు అందరూ ఒకే చోట కూర్చుని భోజనం చేసేలా, కూర్చేబెట్టి వడ్డించే విధంగా ఏర్పాట్లు చేయడంతోపాటు ప్రార్థనతో భోజనం చేసే విధానాన్ని అలవాటు చేయాలని సూచించారు. అక్కడ ఉన్న మోడల్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులను ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంఇఓ కూర్మారావు, హెచ్ ఎం శ్రీనివాసరావు, స్కూల్ చైర్మన్ భాస్కరరావు, సర్పంచ్ రాములమ్మ, స్కూల్ కమిటీ సభ్యులు రామానందం, గోవిందం పాల్గొన్నారు.

పారదర్శక విధానంతో వస్తు సేవల పన్నుకు సన్నద్ధం కావాలి
విజయనగరం(టౌన్), జూన్ 13: వస్తుసేవల ఏకీకృత పన్ను విధానంలోకి వ్యాపారులు తగిన సమాచారంతో సన్నద్ధం కావాలని ట్యాక్స్ కన్సల్టెంట్ ధన్యంరాజు వెంకట్ తెలిపారు. మంగళవారం విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఎపి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీఫెడరేషన్ సంయుక్తంగా పట్టణంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో డీలర్ల కు అవగాహన సదస్సు నిర్వహించాయి. విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎం వి చలం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ట్యాక్స్‌కన్సల్టెంట్ ధన్యంరాజు వెంకట్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న నూతన పన్ను విధానం స్వరూపాన్ని తెలిపారు. జిఎస్‌టిని అమలు చేయడానికి కేంద్రం నిర్వహిస్తున్న కసర త్తు, వ్యాపారులు రిటర్న్‌లుఎలా సమర్పించాలనే అంశాలపై ఆయన అవగాహన కల్పించి వారి సం దేహాలను నివృత్తి చేశారు. వస్తుసేవల పన్ను అమలు విషయంలో ఎటువంటి సందేహాలు ఉండరాదని జూలై ఒకటినుండి అమలులోకి తీసుకురావడానికి కేంద్రం సన్నధ్ధం చేస్తున్నదని, సెప్టెంబర్ నుండి అమలులోకి రావచ్చనేది ఆపోహలు మాత్రమేనని స్పష్టం చేశారు.
జూలై ఒకటి నుండి కొత్త పన్ను విధానం అమలు అవుతుందని, ఈమేరకు వ్యాపారులు, డీలర్లు వారి వ్యాపార ఖాతాలు, స్టాక్ వివరాలు తేడాలు లేకుండా నమోదు చేసుకోవాలని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలులోకి వస్తందని ఏ వస్తువులుపై ఎంత పన్ను ఉంటుంది అనేది తుది రూపు వస్తేనే కానీ చెప్పలేమని అన్నారు. పాత పన్ను చట్టం, నూతన పన్ను విధానానికి చాలా తేడాలు ఉన్నాయని వివరించారు. రిజిస్టరు డీలర్లు నాన్ రిజిస్టరు డీలర్లకు సరుకులు అమ్మినపుడు వారి సమాచారం తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు. ఇన్ పుట్ ట్యాక్స్ విధానంపై వివరించారు. వ్యాపారులు ఇన్వాయిస్ లేకుండా కావాలని తప్పు చేసినా, నకిలీ వివరాలు ఇచ్చినా, మోసగించినా, అటువంటి వ్యాపారులపై చట్ట పరంగా నిబంధనలమేరకు జరిమానా, జైలు శిక్ష వంటివి ఈ నూతన పన్ను విధానంలో పొందుపరచబడ్డాయని తెలిపారు.
అపరాధ రుసుంనకు గురికావల్సి వస్తుందని అన్నారు. వ్యాపారులు పారదర్శకంగా వివరాలు అందించాలని చెప్పారు. మొదటిలో అనేక సందేహాలు ఉండటం సహజమని అమలులోకి వచ్చాక వాటిని అన్వయించుకుంటే సరళీకృతంగా కనిపిస్తాయని సూచించారు. ముగింపు స్టాక్ వివరాలు, కేటగిరి వారీగా వస్తువుల వివరాలు అందచేయాల్సి ఉటుందని స్పష్టం చేసారు. ఇటువంటి అవగాహన సదస్సులు ద్వారా కొంతవరకు డీలర్లలో నెలకొన్న అనుమానాలు నివృత్తిఅవుతాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎం విచలం, ఎపిఛాంబర్ ఆఫ్‌కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ డైరెక్టరు జిశివకుమార్ అన్నారు. ఈ సమావేశంలో సేల్స్‌ట్యాక్స్ విభాగం కమిటీ చైర్మన్ సుధాకర్, ఛాంబర్ సహకార్యదర్శికాపుగంటిశ్రీనివాస్,వ్యాపారులు పాల్గొన్నారు.