విజయనగరం

సెంచూరియన్ వర్శిటీకి సిఎం శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 14: ప్రతిష్ఠాత్మకమైన సెంచూరియన్ వర్శిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. గురువారం విశాఖలోని గేట్‌వే హొటల్ నుంచి రిమోట్ కంట్రోల్‌తో శంకుస్థాపన చేసిన అనంతరం యూనివర్శిటీతో ఎంఒయులు కుదుర్చుకున్న పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. సెంచూరియన్ వర్శిటీని జిల్లాలోని బొండపల్లి మండలం టెక్కలి గ్రామంలో 30 ఎకరాలు, నెల్లిమర్ల మండలంలోని 80 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూమి ఉంది. నాక్-ఎ గ్రేడ్ గుర్తింపు కలిగిన సెంచూరియన్ వర్శిటీని మెరుగైన వసతులతో నిర్మించనున్నట్టు తెలిపారు. కాగా, 2005లో ఒడిశాలోని పర్లాకిమిడిలో ప్రధాన కేంద్రంగా దీనిని నెలకోల్పారు. ప్రస్తుతం రాయగడ, భువనేశ్వర్, బోలాంగీర్, చత్రపూర్ తదితర ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయని వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు తెలిపారు. సెంచూరియన్ వర్శిటీకి ఆస్ట్రేలియాలోని వివిధ యూనివర్శిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విశ్వవిద్యాలయంలో మెరుగైన ర్యాంకులు సాధించిన వారికి, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా (మిగతా 2వ పేజీలో) విద్యను అందివ్వనున్నట్టు వైస్ చైన్సలర్ జిఎస్‌ఎన్ రాజు స్పష్టం చేశారు. సెంచూరియన్ వర్శిటీ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర గనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, ఎమ్మెల్యేలు కె.ఎ.నాయుడు, మీసాల గీత తదితరులు పాల్గొన్నారు.