విజయనగరం

అన్ని వార్డుల అభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, జూన్ 20: పురపాలక సంఘంలో అన్ని వార్డులలోనూ పూర్తిస్థాయిలో రోడ్లు, కాలువలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి అన్నారు. పట్టణ పరిధిలో ఉన్న 5,6,7,8, 30 వార్డులలో మంగళవారం రోడ్లు, కాలువలు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పనులను వేగవంతం చేసేందుకు అధికారులు అప్రమత్తం కావాలన్నారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు ఎటువంటి నాశిరకం మెటీరియల్స్‌ను వినియోగించకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.సకాలంలో పనులను పూర్తిచేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. అన్నివార్డులలోనూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే తెలియజేస్తే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పార్టీలకతీతంగా అభివృద్ధి చేసేందుకు వార్డు కౌన్సిల్ సభ్యులంతా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో వైస్ ఛైర్మన్ చోడగంజి ర మేష్‌నాయుడు, వార్డు కౌన్సిల్ సభ్యులు సుంకరిసాయిరమేష్, శరత్, హైమావతి, కళ్యాణి పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలపై శ్రామిక జన శంఖారావం
గరుగుబిల్లి, జూన్ 20: కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాం డ్ చేస్తూ శ్రామిక జన శంఖారావం కా ర్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సి.ఐ. టి.యు. రాష్ట్ర కార్యదర్శి ఎం.సుబ్బరావమ్మ అన్నారు. శ్రామిక జన శంఖారా వంలోభాగంగా మండల పరిధిలోని ఖ డ్గవలస జంక్షన్‌లో మంగళవారం జీపుజాతా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 24వతేదీ వరకు జిల్లాలో జీపుజాత నిర్వహిస్తున్నామని, రాష్టవ్య్రాప్తంగా అసంఘటిత, సంఘటిత రంగాల్లో దాదాపు కోటిమంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ, ఐ.సి.డి.ఎస్, మధ్యాహ్న భోజన పథకం తదితర పథకాల బడ్జెట్ తగ్గించిందన్నారు. పనిచేస్తున్న కార్మికులకు సమానపనికి సమానం వేతనం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కనీసం వేతనం 18వేల రూపాయలు ఇవ్వాలన్నారు. ఆశా, అంగన్వాడీ, రెండవ ఏ.ఎన్.ఎం.లు, వి.ఆర్.ఏ, మున్సిపల్ కార్మికులకు తెలంగాణా రాష్ట్రంలో ఇస్తున్న మాదిరిగానే వేతనాలు చెల్లించాలన్నారు. వచ్చేనెల 3వతేదీన కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిటు జిల్లా కార్యద ర్శి టి.వి.రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు బి. వి.రమణ, శ్రామిక మహిళా కన్వీనర్ ల క్ష్మి, కె.సాంబమూర్తి పాల్గొన్నారు.