విజయనగరం

మూలుగుతున్న నిధులు.. ముందుకు సాగని పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 27: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం...గుత్తేదారుల గుత్త్ధాపత్యం వల్ల విజయనగరం మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల నిధులు ఖర్చు కాకుండా మూలుగుతున్నాయి. సంవత్సరాల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుండటంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదు. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీలో 15 మందికి మించి కాంట్రాక్టర్లు లేరు. ఇందులో కోటి రూపాయలకు పైబడి పనులు చేసేవారు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. 50 లక్షల రూపాయలకు లోపు పనులు చేసేవారు ఆరుగురు ఉన్నారు. సంవత్సరాల తరబడి వీరికి మున్సిపాలిటీ అడ్డాగా మారింది. కొత్త కాంట్రాక్టర్లు వచ్చినా, ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు టెండర్లు వేసినా పనులు జరగనీయకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. స్థానికంగా రాజకీయ అండదండలు వీరికి పుష్కలంగా ఉండటం వల్ల ఇంజనీరింగ్ అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ పాలకవర్గం కూడా సీరియస్‌గా దృష్టి సారించకపోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. కాంట్రాక్టర్లు సకాలంలో పనులను పూర్తి చేయకపోవడం వల్ల, నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్ట్ఫికేట్ (యుసి) ప్రభుత్వానికి ఇంతవరకు సమర్పించకపోవడం వల్ల ప్రభుత్వం ఇంతవరకు నయాపైసా కూడా విడుదల చేయలేదు. నిధులను సకాంలో ఖర్చు చేసి, యుసి ఇచ్చిన మున్సిపాలిటీలకు మాత్రమే నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, మున్సిపల్ యంత్రాంగం ఇంతవరకు ప్రభుత్వానికి యుసి సమర్పించలేదు. ఈ కారణంగానే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను ఇంతవరకు విడుదల చేయలేదు. మున్సిపాలిటీలో 115.72 కోట్ల రూపాయలతో 558 అభివృద్ధి పనులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తే కేవలం 332 పనులు మాత్రమే పూర్తయ్యాయి. అదేవిధంగా 14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు కాకుండా అతీగతీ లేకుండా ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం పద్దు కింద ప్రభుత్వం 13.92 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇందులో 2015-2016 ఆర్థిక సంవత్సరంలో 5.62 కోట్లు, 2016-2017లో 8.23 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 2015-2016లో విడుదల అయిన నిధులతో అభివృద్ధి పనులు చేసేందుకు గత ఏడాది నవంబరులోను, 2016-2017లో సంవత్సరంలో కేటాయించిన నిధులతో పనులు చేసేందుకు ఈ ఏడాది జనవరిలోను పరిపాలనా ఆమోదం లభించింది. ఈ మేరకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అయితే ఈ నిధులతో ఇంతవరకు ఒక్క పని కూడా చేపట్టలేదు. అదేవిధంగా 13వ ఆర్థిక సంఘం పద్దు కింద కేటాయించిన 12.88 కోట్ల రూపాయలలో ఇంకా 4.90 కోట్ల రూపాయలు ఖర్చు కాకుండా మిగిలిపోయాయి. ఈ నిధులను ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరునాటికి ఖర్చు చేయకపోతే వెనుక్కి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ఆల్టిమేటం జారీ చేసింది. 2011 నుంచి 2014 వరకు మంజూరు చేసిన ఈ నిధులను 2016-2017 సంవత్సరం మార్చినెలాఖరులోగా ఖర్చు చేయాలని అదే గత ఏడాది మేనెలలో ఆదేశాలు జారీ చేసింది. అయితే మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ఈ ఆదేశాలను బేఖాతరు చేయడంతో ఆ నిధులు వెనుక్కి వెళ్లిపోయాయి. ఈ నిధులను ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా ఖర్చు చేయాలని ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ గత ఏఫ్రిల్‌నెలలో మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఇటు కాంట్రాక్టర్లల్లోగాని, అటు అధికారుల్లో గాని ఏమాత్రం చలనం కనిపించడంలేదు. అదేవిధంగా 12వ ఆర్థిక సంఘం పద్దు కింద విడుదల అయిన నిధులలో ఇంకా 65 లక్షల రూపాయలు ఖర్చు కాకుండా మిగిలిపోయాయి. బిపిఎస్ కింద 6.80 కోట్లు, బిఆర్‌జిఎఫ్ కింద మూడు కోట్లు, ఇంటర్ననల్ న్యూ గ్రాంట్సు కింద విడుదల 60 లక్షల రూపాయలలో ఒక్క నయాపైసా కూడా ఖర్చు చేయలేదు. ఇప్పటికే 1.06 కోట్ల రూపాయల ఎస్సీ,ఎస్టీసబ్ ప్లాన్ నిధులు వెనుక్కి వెళ్లిపోగా, 101 పద్దు కింద విడుదల అయిన రెండుకోట్ల రూపాయలను సకాలంలో ఖర్చు చేయకపోవడం వల్ల ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికైనా నిధులను ఖర్చు చేసి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.దీనిపై అసిస్టెంట్ కమిషనర్ కనకమహాలక్ష్మిని అడగ్గా ఈ నిధులను సకాలంలో ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.