విజయనగరం

వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం)టౌన్), జూన్ 27: జిల్లాలోని ఏజెన్సీలో చోటుచేసుకుంటున్న వ్యాధులు, జ్వరాలను దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టిబాబ్జీ కోరారు. ఈమేరకు మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పద్మజను కలుసుకుని వినత్రిపత్రం అందచేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సాలూరు ప్రాంతంలోని ఏజెన్సీ గ్రామాల్లో వ్యాధులు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. జరడవలస, ఎగువశెంబి, పణుకులోవ గ్రామల్లో మలేరియా వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. గిరిజనులకు తక్షణం వైద్య సహాయం అందచేసేలా వైద్యులను అప్రమత్తం చేయాలని కోరారు. ముఖ్యంగా గిరిశిఖర గ్రామాల ప్రజలకు వైద్యం అందచేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వౌళిక సదుపాయాలు కరువై తక్షణ వైద్యం అందకుండా చనిపోతున్న సంఘటనలు లేక పోలేదని గుర్తు చేసారు. పాలకులు మారుతున్నా గిరిజనులు తలరాతలు మారటం లేదని ఆవదన వ్యక్తం చేస్తూ సీజనల్ వ్యాధులు బారిన పడి మరణాలు సంభవించకుండా ముందస్తు చర్యలుతీసుకోవాలని ఆమెను కోరారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు తాట్రాజురాజారావు, ఎర్నిబాబు తదితరులు పాల్గొన్నారు.

కనీస వేతనాలు అమలుకై పోరాటం
* స్కీమ్ వర్కర్ల రిలేదీక్షలు

విజయనగరం(టౌన్), జూన్ 27: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సారధ్యంలోని పలుస్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు ప్రైవేటీకరించే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ సిటు ఆధ్వర్యంలోని స్కీమ్ వర్కర్ల కార్మికులు మంగళవారం కలెక్టరేట్ వద్ద రిలే దీక్ష ఆందోళన చేపట్టారు. శ్రామిక జన శంఖారావంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేఖంగా సిటు అన్ని కార్మిక సంఘాలను కలిపి ఉద్యమించేందుకు సమాయత్తం అవుతున్నది. ఇందులో భాగంగా మధ్యాహ్నభోజన పధకం కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఎపి ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు బొత్స సుదారాణి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతే అంగన్ వాడీ కేంద్రాలను కుదించే చర్యలకు ప్రభ/త్వం సిద్ధ పడుతున్నదని ఆరోపించారు. మధ్యాహ్న భోజనపథకంను ప్రవేటు సంస్ధలకు అప్పగించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే మెమోలు జారీ చేసిందని ఆందోళన వ్యక్తం చేసారు. నెల్లూరు ప్రవేటు సంస్ధకు అప్పగించి తిరిగి డ్వాక్రా మహిళా సంఘాల చేతికే వంట నిర్వహణను అప్పగించిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వం ఇటువంటి విధానాలను విడనాడాలని డిమాండ్ చేసారు. జూలై 3న తలపెట్టిన కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈదీక్షల్లో పైడిరాజు, కృష్ణ వేణి తదితరులు పాల్గొన్నారు.