విజయనగరం

ఫసల్ బీమాలో చేరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 27: జిల్లాలోని రైతులు ప్రధానమంత్రి పంటల భీమా పథకంలో చేరాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన ప్రధానమంత్రి పంటల బీమా యోజన పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫసల్ బీమా పంటల బీమా పధకం రైతులకు ఎంతో ప్రయోజనకరమన్నారు. తక్కువ ప్రీమియం చెల్లించి ఎక్కువ బీమా పొందవచ్చన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టం సంభవించినపుడు పంట పరిహారం పొందవచ్చన్నారు. కోతలైన తరువాత 14 రోజుల వరకు పనలు మీద ఉన్నప్పడు, తుపాను వల్ల వర్షాలతో నష్టపోయిన సందర్భాలలో కూడా పంటలకు బీమా వర్తిస్తుందని కలలెక్టర్ వివరించారు. జిల్లాలో ఏయే పంటలకు బీమా వర్తిస్తుందో వివరించారు. వరి పంటకు గ్రామం యూనిట్‌గా పరిగణిస్తారన్నారు. వరి, సజ్జలు, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, చెరకు, చెరకు (కార్శి)లకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. వర్షాధారంపై పండే వేరుశనగ, పత్తి పంటలకు ఈ పథకం వర్తిస్తుందని వివరించారు. వరికి హెక్టారుకు రూ.1350, సజ్జలు రూ.300, మొక్కజొన్న రూ.1000, వేరుశనగ రూ.750, పత్తి రూ.2600, చెరకు రూ.4700, చెరకు (కార్శి) రూ.3300 ప్రీమియం రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. బ్యాంకులో రుణం పొందని రైతులకు వచ్చే నెలాఖరు వరకు గడువు ఉందన్నారు. బ్యాంకులో రుణం తీసుకున్న వారికి ఆగస్టు 21 వరకు గడువు ఉంటుందని వివరించారు. అందువల్ల వ్యవసాయాధికారులు పొలం పిలుస్తొంది కార్యక్రమంలో రైతులకు ఫసల్ బీమాపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 2 లక్షల మంది రైతులకు ఈ బీమా పధధకంలో చేర్చడానికి లక్ష్యాన్ని నిర్ధేశించినట్టు చెప్పారు. ఈ పథకానికి సంబంధించి జిల్లాకు ఐసిఐసిఐ లాంబర్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ గుర్తించబడిందన్నారు. కాగా, బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకోని రైతులు, కౌలు రైతుల వివరాలను వ్యవసాయశాఖ సిబ్బంది నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకు ఎస్‌హెచ్‌జిలను సర్వీసు ప్రొవైడర్‌గా నియమించినట్టు తెలిపారు. వారం వారం పంటల బీమా ఫథకంపై సమీక్ష ఉంటుంద్నాదరు. ఈ ఖరీఫ్‌లో బ్యాంకర్లు ఆగస్టులోగా పంట రుణాలను మంజూరు చేయాలని నాబార్డు ఎజిఎం శ్రీనివాసరావును ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్వో రాజ్‌కుమార్, సిపిఒ విజయలక్ష్మి, జెడి లీలావతి, డిడి లక్ష్మినారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సమాజానికి మద్యంకాదు.. మంచి విద్య కావాలి
* ఐద్వా ర్యాలీని ప్రారంభించిన మాజీ ఎంపి డివిజి

విజయనగరం(టౌన్), జూన్ 27: సమాజానికి కావాల్సింది మద్యం కాదని మంచి విద్యనేని మాజీ ఎంపి డివిజి శంకరరావు అన్నారు. మూడు రోజులుపాటు ఐద్వా ఆధ్వర్యంలోజిల్లాలోచేపట్టే మద్యంపై యుద్ధం జీపుజాతాను సిపి ఎం పార్టీ కార్యాలయం ఎల్‌బిజి భవనం వద్ద మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగార్యాలీని ఉద్ధేశించి డివిజి మాట్లాడుతూ మద్యం ఆదాయంపై ప్రభుత్వాలు ఆధారపడటం సిగ్గుచేటని అభిప్రాయ పడ్డారు. ఒక్క బెల్టుషాపు మూతపడలేదని కానీ రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలు మూతపడటం ఆందోళన కరమని ఆవేదన వ్యక్తం చేసారు. సమాజానికి కావల్సింది మంచి విద్యకానీ మద్యం కాదని హితవు పలికారు. ఎయు నిర్వహించిన సర్వేలో ఉపాధిహామీ పథకం కింద కూలీలకు లభిస్తున్న వేతనం, రోజువారీ కూలీల సంపాదనలో సగభాగం మద్యం వ్యసనానికి ఖర్చు చేస్తున్నట్టు అధ్యయనం వెల్లడిస్తోందని తెలిపారు. ఇప్పటికయినా కళ్లుతెరవాలని సూచించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి వి లక్ష్మి మాట్లాడుతూ ఎన్టీ ఆర్ మద్యం నియంత్రణ అమలు చేస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల ముందర ప్రజలకు ఇచ్చిన హామీ మరిచాకరని ఆరోపించారు. మూడు రోజులు జరిగే ఈర్యాలీ ద్వారా సమాజంలో చైతన్యం తీసుకువస్తామని అన్నారు. ఈర్యాలీలో ఐద్వా నాయకులు రమణమ్మ, ఇందిర, సిపి ఎం డివిజన్ కార్యదర్శి రెడ్డిశంకరరావు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శిసురేష్, కె విపి ఎస్ నాయకులు రాకోటి ఆనంద్ మహిళలు పాల్గొన్నారు.