విజయనగరం

రైల్వే సమస్యలపై దృష్టి సారించండి:వైకాపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, జూన్ 27: చీపురుపల్లి రైల్వేస్టేషన్‌లో తిష్టవేసిన సమస్యలపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, స్థానిక ఎమ్మెల్యే మృణాళిని దృష్టి సారించాలని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మరోనాయకుడు ఇప్పిలి అనంత్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చీపురుపల్లి రైల్వేస్టేషన్ చుట్టు ప్రక్కల సుమారు తొమ్మిది మండలాల ప్రజలకు ఉపయోగంలో ఉన్నా అందుకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చీపురుపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జినిర్మాణం చెయ్యడం ద్వారా ప్రయాణీకులకు ఎటువంటి ప్రమాదాలు జరగుకుండా ఉంటుందన్నారు. ప్రయాణీకుల దర్దీని దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్న తత్కాల్ రిజర్వేషన్ సౌకర్యాన్ని పునరుద్దరించాలని కోరారు. అలాగే రిజర్వేషన్ టైమింగ్స్‌ను కూడా ప్రయాణీకులకు అనుకూలంగా మార్పులు చెయ్యాలని సూచించారు. అంతేకాకుండా జిల్లాలో విజయనగరం తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చే స్టేషన్ చీపురుపల్లేనని దానిని దృష్టిలో ఉంచుకొని ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లను ఆపించే వెసులుబాటును కల్పించాలన్నారు. మాజీ ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మీ సుమారు రూ.60లక్షల నిధులతో చీపురుపల్లి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేశారని, తర్వాత పట్టించుకొనేవారే లేరన్నారు. జిల్లాలో కేంద్ర మంత్రి పదవి ఉండి కూడా ఇక్కడి నాయకులు రైల్వేస్టేషన్ అభివృద్ధిపై దృష్టిసారించడంలేదని ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా చీపురుపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధిపై చిత్తశుద్ధితో కృషిచెయ్యాలని ఆ నాయకులు కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు కరిమజ్జి శ్రీనివాసరావు, రఘుమండ త్రినాధ్, రేవళ్ల సత్తిబాబు, కంది పాపినాయుడు, మీసాల విశే్వశ్వరరావు, అధికార్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ సేవలు భేష్!

విజయనగరం, జూన్ 27: జిల్లాలో కొద్ది కాలం మాత్రమే ఎస్పీ ఎల్‌కెవి రంగారావు పనిచేసినప్పటికీ అందరి మన్ననలు అందుకున్నారని పలువురు పోలీసు అధికారులు కొనియాడారు. మంగళవారం ఇక్కడ ఓ హొటల్‌లో ఆయనకు సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎఎస్పీ ఎవి రమణ, డిఎస్పీలు రమణ తదితరులు మాట్లాడుతూ పోలీసు శాఖలో మార్పు రావాలని తపనపడిన అధికారుల్లో ఒకరని కొనియాడారు. పోలీసుల్లో మార్పు కోసం పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టి వారిలో మార్పుకు కృషి చేశారన్నారు. నిజాయితీగా పనిచేయడంతోపాటు అందరు నిజాయితీగా ఉండాలని కోరుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.