విజయనగరం

స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలి:మృణాళిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, ఆగస్టు 15: స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలని అప్పుడే స్వాతంత్య్రం సాధించిన కళ సాకారమవుతుందని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యురాలు కిమిడి మృణాళిని అన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా ఆమె మంగళవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలోను, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్న విషయాన్ని ఆమె వివరించారు. విద్యార్ధి దశలోనే ఉన్నత లక్షణాలను అలవరుచుకొని మంచి లక్ష్యాలు సాధించడమే లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎందరో త్యాగాలు చేయడం ద్వారా ఈరోజు స్వాతంత్య్ర ఫలాలను ఆనందిస్తున్నామని తెలిపారు. అనంతరం గత ఏడాది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధిని విద్యార్ధులకు స్థానికుల ఆర్ధిక సహకారంతో ఇచ్చిన ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్ధులకు నిర్వహించిన క్రీడాపోటీల్లో ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి రౌతు కాంతమ్మ, ఆర్ ఈ సి ఎస్ ఛైర్మన్ దన్నాన రామచంద్రుడు, పాలకవర్గ సభ్యుడు గవిడి నాగరాజు, ఎంపిటీసి, పంచాయితీ వార్డు సభ్యులు, ఎమ్మార్వో ప్రసాద్‌పాత్రో, విద్యాశాఖాధికారి మహాలక్ష్మునాయుడు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మండుటెండలో విద్యార్ధులు
చీపురుపల్లి, ఆగస్టు 15: స్వాతంత్య్ర వేడుకలు సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో నిర్వహించిన వేడకల ఆలస్యంగా ప్రారంభవ్వడంతో విద్యార్ధులు మండుటెండలో నిల్చోవల్సి వచ్చింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పతాకావిష్కరణ కాస్త ఆలస్యంగా జరిగింది. సమావేశం కోసం వేసిన వేదిక సమీపంలో విద్యార్ధులు కూర్చునేందుకు టెంట్లు వెయ్యకపోవడంతో చివరకు పాఠశాలలో ఉన్న పెద్దమర్రిచెట్టు కింద వేదికకు కాస్త దూరంగా ఉండి ఎమ్మెల్యే ప్రసంగం వినాల్సి వచ్చింది. ఇక్కడి కార్యక్రమం ముగించుకొని గురుకుల పాఠశాలకు వెళ్లే సరికి సుమారు 12 గంటలు కావడంతో అప్పటి వరకు అక్కడ జండా అవిష్కర జరగలేదు. విద్యార్ధినులు కూడా అప్పటివరకు మండుటెండలో ఉండాల్సి వచ్చింది. కాళ్లకు చెప్పులు లేకపోవడంతో కొంతమంది నీడ ఉన్నచోటకి చేరుకున్నారు.

వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలు
చీపురుపల్లి, ఆగస్టు 15: 71వ స్వాతంత్య్ర వేడుకలు మండలంలో మంగళవారం ఘనంగా జరిగాయి. పలు చోట్ల ఎమ్మెల్యే మృణాళిని పతాకావిష్కరణ చేశారు. స్థానిక పంచాయితీ కార్యాలయంలోను, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జెడ్పీటీసి మీసాల వరహాలనాయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపిపి రౌతు కాంతమ్మ మవ్వెన్నల జెండాను ఆవిష్కరించారు. స్థానిక కోర్టులో న్యాయమూర్తి, పోష్టల్ కార్యాలయంలో పోస్టుమాష్టర్ పతాకాన్ని ఎగురవేశారు. మండలంలోని ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్థానిక నాయకులు ఆధ్వర్యంలో పతాకావిష్కరణలు జరిగాయి. పోలీసు స్టేషన్‌లో సి ఐ సిహెచ్ శ్యామలరావు పతాకాన్ని ఎగురవేయగా ఎస్సై కాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్ ఈ సి ఎస్ కార్యాలయం వద్ద సంస్థ ఛైర్మన్ దన్నాన రామచంద్రుడు పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జిల్లా పార్టీ వ్యవహారాల కన్వీనర్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇప్పిలి అనంత్, పలువురు సర్పంచ్‌లు, ఎంపిటీసి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు, సిబ్బందికి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. కాగా స్థానిక సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో మాత్రం అధికారులు, సిబ్బంది ఎవ్వరూ రాకపోయినా అక్కడే పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు ఆధ్వర్యంలో మూడురంగుల జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. అయితే వరసగా సెలవులు రావడంతో స్వాతంత్య్ర దినోత్సవాల్లో అధికారులు, సిబ్బంది కొన్నిచోట్ల పాల్గొనకపోవడం కనిపించింది.

రెడ్డి రవణకు ఉత్తమ సేవకుడి అవార్డు
చీపురుపల్లి, ఆగస్టు 15: ఆశయ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి రమణకు ఉత్తమ సేవకుడిగా అవార్డు లభించింది. ఈమేరకు 71 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధిశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. గత రెండు సంత్సరాలుగా రెడ్డి రమణ చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తునే ఉంది. ఈ ఏడాది కూడా తనకు ఈ అవార్డు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రమణకు ఉత్తమ సేవక్ పురష్కారాన్ని అందజేసి గౌరవించినట్టు ఆయన తెలిపారు.

అంబరాన్ని అంటిన స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు

గజపతినగరం, ఆగస్టు 15: గజపతినగరం ప్రాంతంలో మంగళవారం 71వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. గజపతినగరం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ప్రాణత్యాగాలవలన స్వాతంత్య్రం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, తహశీల్దార్ కె. శేషగిరిరావు, టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రావిశ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. గజపతినగరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపిడిఓ కృష్ణవేణమ్మ, ఇఓపిఆర్‌డి జనార్థనరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతాపార్టీ కార్యాలయం వద్ద సీనియర్ వైద్యులు డాక్టర్ వేదుల కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.వి.వి.గోపాలరాజు, బిజెపి నాయకులు కె. ఎన్. ఎం.శర్మ, కందుల గుప్త, పొట్టామహేశ్వరరావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రెడ్డిపావని తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పడాల అరుణ తన స్వగృహం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కంది తిరుపతినాయుడు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. గజపతినగరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయ ఆవరణలో సొసైటీ అధ్యక్షుడు కరణం ఆదినారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సి ఇ ఓ నారాయణరావు, పలువురు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. గజపతినగరం సర్కిల్ కార్యాలయ ఆవరణలో సిఐ లీలారావుజాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా ఎస్సై వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో సిఐ రాజశేఖరనాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్సైలు భాస్కరరావు, మాన్యాలు, సిబ్బంది పాల్గొన్నారు. గజపతినగరం పంచాయితీ కార్యాలయ ఆవరణలో గ్రామ సర్పంచ్ నరవ ఆదిలక్ష్మి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పంచాయితీ కార్యనిర్వహణాధికారి సుగుణాకరరావు పాల్గొన్నారు. గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ, పురిటిపంచాయితీ కార్యాలయ ఆవరణలో ఆ గ్రామ సర్పంచ్ మండల సురేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయితీ కార్యాలయ ఆవరణలోను, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.

పండగను తలపించిన ఆగస్టు 15

లక్కవరపుకోట, ఆగస్టు 15: మండలంలో జరిగిన ఆగస్టు 15 ఉత్సవాలు పండగను తలపించాయి. ప్రతి గ్రామంలో గల పాఠశాలల్లోను, ప్రభుత్వ కార్యాలయాలలోను మూడు రంగల మువ్వనె్నల జెండా రెపరెపలాడుతూ పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ముందురోజు రాత్రి నుంచే పాఠశాలలను, కార్యాలయాలను రంగురంగుల కాగితాలతో ముస్తాబు చేశారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవంలో అందరు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తహశీల్దార్ కార్యాలయం వద్ద జెండాను ఎగురవేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం గర్వించదగిన రోజు, నిజమైన పండగరోజు ఆగస్టు 15 మాత్రమేనని, ఇది ఎందరో త్యాగదనుల గుర్తుగా చేసుకునే రోజు అని అన్నారు. ఈ రోజు అంత సులువుగా రాలేదని, ఎంతోమంది తమ ప్రాణాలను పణంగా పెట్టి భవిష్యత్ తరాల కోసం చేసి త్యాగఫలమని అన్నారు. ఈ స్వతంత్య్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. ఎల్.కోట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో హెచ్‌ఎం సి.హెచ్. ఈశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన జడ్పీటిసి కరెడ్ల ఈశ్వరరావు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతి కార్యక్రమాలు, యోగా విన్యాసాలను చేసి ఆహుతులను అలరించారు. తహశీల్దార్ రాములమ్మ, ఎంపిడిఒ జి.వి.రమణమ్మ, ఎంపిపి కొల్లిరమణమూర్తి, ఎస్సై ఎం.శ్రీనివాస్ తమ తమతమ కార్యాలయాలలో జెండా పండగలో పాల్గొన్నారు.

బొండపల్లిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

బొండపల్లి, ఆగస్టు 15: బొండపల్లి మండలంలోని 26 గ్రామపంచాయితీలు, మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయాలు, పోలీసు స్టేషన్‌లతోపాటు ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ హూస్కూళ్లల్లో జాతీయ పతాకాలను ఘనంగా ఎగురవేశారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపిపి పిరిడి ఎల్లమ్మ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జడ్పీటీసి బండారుబాలాజీ, స్థానిక పోలీసుస్టేషన్ ఆవరణలో ఎస్సై సుదర్శన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కెజిబివి పాఠశాల, ఎస్. ఆర్. హైస్కూల్, దేవానంద పాఠశాలలో కూడా జాతీయ పతకాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎంపిపి, జడ్పీటిసి, తహశీల్దార్లు స్వాతంత్య్రం కోసం పోరాడిన త్యాగదనులను స్మరిస్తూ ప్రసంగించారు. ఎంపిడిఓ ప్రకాశరావు క్విట్ ఇండియా ఉద్యమం 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా సంకల్ప భారత దేశంపై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంపిపి ఎల్లమ్మ, జడ్పీటిసి బాలాజీ, తహశీల్దార్ బాపిరాజు, ఎంపి డి ఓ ప్రకాశరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఇఓపిఆర్‌డి రవికుమార్, ఎంఇఓ సింహాచలం, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.
============

ఘనంగా 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

దత్తిరాజేరు, ఆగస్టు 15: మండలంలో మంగళవారం 71 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి బి.రాజేశ్వరీ జెండా వందనం చేసి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ విశిష్టతను తెలిపారు. తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ జి.కల్పవల్లి జెండా వందనం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి సత్యనారాయణ, కస్తూరీభా గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీదేవిలు జెండా వందనం జరిపి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల గురించి వివరించారు. అలాగే పెదమానాపురం పోలీసుస్టేషన్‌లో ఎస్సై కె.నాయుడు, ఎస్.బూర్జివలస పోలీసు స్టేషన్‌లో ఎస్సై రమేష్‌నాయుడు జెండా వందనం జరిపారు. కోరపుకొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి కిరణ్‌కుమార్ జెండావందనం జరిపారు. మండలంలోని 8 ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో ఆయా ప్రధానోపాధ్యాయులు జెండా వందనం జరిపి ఆటలపోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో మండలంలోని అన్ని గ్రామ పంచాయితీల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు ఆయా పాఠశాలల్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకలలో పాల్గొన్నారు.