విజయనగరం

జిల్లాను అభివృద్ధి బాటలో నిలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 15: జిల్లాను అభివృద్ధి బాటలో నిలపాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మంగళవారం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం అమరులు చేసిన త్యాగఫలాలు మరువలేనివన్నారు. పరాయి పాలన నుంచి జాతి విముక్తి కోసం పోరాడిన మహనీయులందరికీ నివాళులర్పించారు. రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్లలోనే రెండంకెల వృద్ధిరేటు సాధించడం ద్వారా మనశక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పగలిగామన్నారు. 2022 నాటికి దేశంలో మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగాను, 2029 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపొందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి రహిత పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పాఠశాలలు, వసతి గృహాల్లో బయోమెట్రిక్ హాజరు, పింఛను పంపిణీకి బయోమెట్రిక్ విధానం, రేషన్ పంపిణీకి ఈ పాస్ పద్దతులను అనుసరించడం ద్వారా అవినీతి అక్రమాలకు తావులేకుండా ప్రజా ధనం వృధాగాకుండా నిరోదించగలుగుతున్నామన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్నదీ ముఖ్యమంత్రి ఆశయమన్నారు. తోటపల్లి ద్వారా 70వేల ఎకరాలకు సాగునీరందించడం, 2018 నాటికి తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఖరీఫ్‌లో రూ.578 కోట్లు పంట రుణాలు అందించారని తెలిపారు. రుణమాఫీని రెండు విడతలుగా రూ.381 కోట్లు మాఫీ చేశామన్నారు. ఈ ఏడాది రూ.12.23 కోట్ల విలువైన యంత్ర పరికరాలను రైతులకు రాయితీపై అందజేస్తున్నామన్నారు. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర వద్ద ఉద్యానశాఖ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. పాడిపరిశ్రమకు సంబంధించి ఊరూర పశుగ్రాస క్షేత్రాలు, ఏడాదికో దూడ, క్షీరసాగర, సునందిని పధకాలను అమలు చేస్తున్నామన్నారు. గరివిడిలో పశువైద్య కళాశాల మంజూరైందని, రూ.81.72 కోట్లతో ఈ కళాశాల త్వరలో ఏర్పాటు కానుందన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా కన్వర్జెన్సీ నిధులతో జిల్లాలో 449 అంగన్‌వాడీ భవనాలు, 143 గ్రామ పంచాయతీ భవనాలు, 837 శ్మశాన వాటకలను ఇప్పటి వరకు మంజూరు చేసినట్టు తెలిపారు. 280 కిమీ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. 2014 నాటికి జిల్లాలో 9 శాతం కుటుంబాలకు మాత్రమే మరుగుదొడ్లు ఉండేవని నేడు వాటి సంఖ్య 37.87 శాతానికి చేరిందన్నిరు. జిల్లాలో ఇప్పటికే 132 గ్రామాలు ఆరుబయట మలవిసర్జన లేని గ్రామాలుగా రూపొందాయని తెలిపారు. జిల్లాలో 336 గ్రామాలను బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా రూపొందించాలని జిల్లా యంత్రాంగం సంకల్పించిందన్నారు. వంద గంటల్లో పదివేల మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారన్నారు. జిల్లాలో 138 గ్రామాల్లో ఘన వ్యర్థాల నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారన్నారు. జిల్లాలో 524 గ్రామాల్లో ఎంపి ల్యాడ్స్‌తో ఎల్‌ఇడి దీపాలు ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లాలో పిఎంజిఎస్‌వై పథకం కింద రొ.16 కోట్లతో ఏడు వంతెనల నిర్మిణాలు చేపట్టారని వివరించారు. జెడ్పీ ఆధ్వర్యంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.18.43 కోట్లతో 26 సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాల నిర్వహణ చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో అందరికీ ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం చేపడుతున్నామన్నారు. జిల్లాలో సాగునీటితోపాటు గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రూ.260 కోట్ల వ్యయంతో 3764 చెరువులు , చెక్‌డ్యామ్‌లు, ఛానళ్ల మరమ్మతులు, ఎత్తిపోతల పథకాల మరమ్మతులు చేపట్టామన్నారు. జిల్లాలో 457 సౌరవిద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. కిడ్నీ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విజయనగరం, పార్వతీపురంలో రెండు డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించినట్టు చెప్పారు. బోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకులన్ని తొలగిపోయాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రూ.22 కోట్లతో 12 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధం కానున్నాయన్నారు. ఈ ఏడాది రెండు వందల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. పట్టణంలో రోడ్ల విస్తరణ కార్యక్రమాలతో పట్టణ రూపురేఖలు మారనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, ఎస్పీ పాలరాజు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు కెఎ నాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, కోయ్యాన శ్రీవాణిలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

వాడవాడల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
* దేశాన్ని పట్టిపీడిస్తున్న ఆరు శత్రువులను పారద్రోలండి

జామి, ఆగస్టు 15: మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలోను, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడి ఒ కార్యాలయం వద్ద, తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎంపిపి పారశాన అప్పయ్యమ్మ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అధికారులు, తహశీల్దార్ ఆనందరావు, ఎంపిడిఓ ఈశ్వరరావులు దేశఘనతను చాటారు. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న ఆరు శత్రువులైన కులం, మతం, పారిశుద్ధ్యం, అవినీతి, ఫ్యాక్షనిజం వంటి వాటిని పారద్రోలలని నేటి యువతకు పిలుపునిచ్చారు. ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుల ప్రాణత్యాగాల గురించి వరించారు. ఈ సందర్భంగా వారికి వందనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులతోపాటు నాయకులు ఉన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించడంలేదు
* గజపతినగరం ఎమ్మెల్యే వైఖరిపై జడ్పీటిసి మండిపాటు

జామి, ఆగస్టు 15: గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అభివృద్ధి కార్యక్రమాలకు ఏమాత్రం సహకరించడంలేదని జామి మండల జడ్పీటిసి బండారు పెదబాబు ఆరోపించారు. మంగళవారం ఈమేరకు జామి మండల పరిషత్ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు గ్రామాలలో ఆయన వెంట తిరిగి ఎన్నో వాగ్ధానాలుచేశామని అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వైఖరి ఏమాత్రం బాగోలేదని అన్నారు. తనకు సహకరించిన మాకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడంలేదని అన్నారు. గ్రామాలలో ఇళ్లు, పింఛన్లు తదితర కార్యక్రమాలకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. గ్రామాలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే జడ్పీటిసిగా తాను ఎందుకు ఉండడమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆకట్టుకున్న పిరమిడ్ విన్యాశాలు

జామి, ఆగస్టు 15: మండలంలోని అలమండ గ్రామంలో బాపు ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు లగుడు సింహాద్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఎన్ సిసి విద్యార్థులచే పిరమిడ్ విన్యాశాలు చేయించారు. కాలుతున్న పెంకులు పగలగొట్టడం, పడుకున్న వ్యక్తిపై నుండి ద్విచక్రవాహనాన్ని నడపడం, జెండావందనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ లగుడు రామకృష్ణ, గ్రామ సర్పంచ్ వెంకటరావు తదితరులు ఉన్నారు.

నిరుద్యోగులకు వరం-యువశ్రీ గ్రంథాలయం

గరివిడి, ఆగస్టు 15: నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తోడ్పాటును అందిస్తున్న యువశ్రీ గ్రంథాలయం నిరుద్యోగులకు వరమని శ్రీమహలక్ష్మి ఫెర్రో ఎల్లాయిస్ డైరెక్టర్ వాకాడ గోపి అన్నారు. మంగళవారం స్థానిక టీచర్స్ కాలనీ సహాయ పార్కు వద్ద చందక శ్రీను మెమోరియల్ యువశ్రీ గ్రంథాలయానికి భవన సదుపాయం కల్పించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వాకాడ శ్రీను, వాకాడ గోపి ఆధ్వర్యంలో యువశ్రీ గ్రంథాలయానికి సొంత భవనం ఏర్పాటు కావడం హర్షనీయమని ప్రముఖ పారిశ్రామిక వేత్త బి.శంకరరావు శర్మ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై ఎస్. శ్రీనివాస్, సహాయ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు కుప్పుశ్రీనివాస్, యువశ్రీ గ్రంథాలయ వ్యవస్థాపకుడు ఎస్. రత్నగిరి, మాజీ ఎంపిపి కె.కృష్ణంనాయుడు తదితరులు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ,యువకులకు ఉద్యోగాలు పొందడం నిరంతర సాధన అవసరమని అన్నారు. ఈ దిశగా యువతీ, యువకులను తీర్చిదిద్దడంలో యువశ్రీ గ్రంథాలయం ఎంతో తోడ్పాటును అందిస్తున్నదని అన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులకు దిక్సూచీగా పనిచేస్తున్న యువశ్రీ గ్రంథాలయాన్ని వ్యవస్థాపన చేసిన ఎస్. రత్నగిరిని పలువురు ఈ సందర్భంగా అభినందించారు. అంతకుముందు ఇక్కడ సహాయ పార్కు వద్ద సహాయ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిపారు.

ఆర్ ఈ సి ఎస్ ఎడిఈ వర్మకి అవార్డు
చీపురుపల్లి, ఆగస్టు 15: గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంస్థలో ఎడిఈ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జి ఎస్ ఎన్ వర్మకు ఉత్తమ సేవలందించినందుకుగాను అవార్డు వచ్చినట్టు సంస్థ మేనేజర్ సుధాకర్ తెలిపారు. విద్యుత్ శాఖలో ఉత్తమ సేవలందించినందుకుగాను జిల్లా ఎంపిక కమిటి వర్మను ఎంపిక చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అవార్డును స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు చేతులమీదుగా ఈ అవార్డును వర్మ అందుకున్నారు. సంస్థ ఉద్యోగులు వర్మకు అభినందనలు తెలియజేశారు.

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

లక్కవరపుకోట, ఆగస్టు 15: మండలంలోని కళ్లేపలి రేగ శివారు పూడివానిపాలెంకు చెందిన కిల్లి అప్పల్లా(52) అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం కురిసిన వర్షానికి వరినారు తీసి ఉడుపు ప్రారంభించేందుకు పొలంలో ఏర్పాట్లు చేస్తున్న సమయంలో పిడుగుపడి అక్కడికక్కడే అప్పల్లా మృతిచెందాడు. పక్కనే అతనితోపాటు పనిచేస్తున్న భార్య అమ్మాయిలు గాయాలపాలు అయింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి మృతుని బంధువులను పరామర్శించేందుకు ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి కుటుంబానికి అన్ని విధాల సహాయ పడతానని వాగ్ధానం చేశారు. సత్వర సహాయంగా ఏడు వేల రూపాయలను తన తరపున ఏడు వేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేశారు. మరియు చంద్రన్న బీమా ఐదు వేల రూపాయలను అందించారు.

స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలి
* ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు

నెల్లిమర్ల, ఆగస్టు 15: స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలని ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు అన్నారు. మంగళవారం 71వ స్వాతంత్య్ర వేడుకలు వాడవాడల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు నగర పంచాయితీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందని అన్నారు. స్వతంత్య్ర ఫలాలు అందరికీ చేరే విధంగా కృషి చేయాలని అన్నారు. అన్ని వర్గాలు కలసికట్టుగా పనిచేసి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కోటి రూపాయల విలువైన బ్యాంకు లింకేజీ రుణాలు, చంద్రన్న బీమా పథకాలు లబ్దిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ కె. చిన్నారావు, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపిడిఓ కె.రాజ్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషనర్ టి. జయరామ్, నాయకులు బైరెడ్డినాగేశ్వరరావు, లెంక అప్పలనాయుడు, అవనాపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఎంపిడిఒగా రాజ్‌కుమార్

నెల్లిమర్ల, ఆగస్టు 15: నెల్లిమర్ల ఎంపిడిఒ కె.రాజ్‌కుమార్ ఉత్తమ ఎంపిడిఒగా ప్రసంశాపత్రాన్ని అందుకున్నారు. మంగళవారం స్వతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇన్‌ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంపిడిఒకు ప్రసంశాపత్రాన్ని అందజేశారు. మండలంలో శతశాతం మరుగుదొడ్లు నిర్మాణంచేపట్టినందుకుగాను ఈప్రసంశాపత్రాన్ని అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల ప్రజల సహకారంతో మరుగుదొడ్లు నిర్మాణాలు, అభివృద్ధి పనులు పూర్తిచేశామని అన్నారు. అందరి సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

స్వాతంత్య్రం దినోత్సవం స్ఫూర్తిగా అభివృద్ధివైపు
* జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి

విజయనగరం(టౌన్), ఆగస్టు 15: ఎందరో త్యాగాల స్ఫూర్తిగా లభించిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధివైపు నడవాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వాతిరాణి ఆకాంక్షించారు. మంగళవారం జిల్లా పరిషత్ ఆవరణలో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆమె సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. విజయనగరం జిల్లా డిజేబుల్డ్ క్రికెట్ టీమ్‌కు ఎంపికైన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సాహకంగా పదివేల రూపాయలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి, సిఇఓ అనిత, డిప్యూటీ సిఇఒ శ్రీధర్ రాజా, జడ్పీ పరిపాలనా విభాగం సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

వ్యాపారస్తులు ముందుచూపుతో వ్యవహరించాలి

విజయనగరం(టౌన్), ఆగస్టు 15: విజయనగరం ఛాంబర్ ఆఫ్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛాంబర్ అధ్యక్షులు పి. ఎస్.సి. నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వాణిజ్య మండలి సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశ పౌరులు స్వేచ్చగా జీవించడానికి సరిహద్దుల్లో వీరజవాన్లు సర్వస్వం అర్పిస్తున్నారని కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల వలన దేశం స్వేచ్ఛా వాయువులు పీలుస్తోందని చెప్పారు. షాపింగ్‌మాల్స్ కారణంగా అనూహ్య మార్పులు వ్యాపార రంగంలో చోటుచేసుకుంటున్నాయని ఈ నేపథ్యంలో ముందుచూపుతో సూచించారు. జిఎస్‌టిపై వ్యాపారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తామని అన్నారు. చార్ట్‌డ్ అకౌంటెంట్ పరీక్షలలో ఉత్తీర్ణులైన నూనె అభిలాష్‌ను అభినందించారు. విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలు, పారితోషికాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ కార్యదర్శి కె.ప్రభాకరరావు, సభ్యులు చంద్రశేఖరరావు, నర్సింహం, శ్రీనివాసరావు, శ్రీనివాస్, బ్రహ్మాజీ, కాశీవిశ్వనాథ్, బన్‌సాలి తదితరులు పాల్గొన్నారు.

దేశాభివృద్ధి యువత చేతుల్లోనే

విజయనగరం(టౌన్), ఆగస్టు 15: దేశాభివృద్ధి యువత చేతుల్లోనే ఆధారపడి ఉందని జెఎన్‌టియు కళాశాల ప్రిన్సిపాల్ వి.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం జె ఎన్ టియు విజయనగరం క్యాంపస్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకాం అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం కీలకమని చెబుతూ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని తీసుకుని దేశ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ స్వామినాయుడు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు

విజయనగరం(పూల్‌బాగ్), ఆగస్టు 15: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారికి శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున ఆలయ అర్చకులు అమ్మవారికి శ్రీచక్ర పూజలు, కుంకుమపూజలు జరిపారు. అనంతరం అమ్మవారికి జిలేబీలు, పండ్లు నైవేధ్యంగా సమర్పించారు. ఆలయ అర్చకులు మూలాపాపారావు, బంటుపల్లి పైడిరాజులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.