విజయనగరం

బొబ్బిలి టిడిపికి నేతల కళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, ఏప్రిల్ 19: బొబ్బిలి నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనబడుతోంది. నియోజకవర్గానికి పెద్దదిక్కుగా ఉన్న ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, బేబీనాయన తమ అనుచరులతో భారీగా నేడు టిడిపి తీర్థం పుచ్చుకోనున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో చెప్పుకోదగిన నేత అంటూ ఎవరూ లేకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇదే సమయంలో బొబ్బిలిరాజుల చేరికతో నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీలో జోష్ కనబడుతోంది. పార్టీలో ముఖ్యనాయకుల రాకతో కళకళలాడనుంది. ఎమ్మెల్యేతోపాటు వైఎస్‌ఆర్ సిపికి మద్దతు తెలియజేస్తున్న సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వార్డు మెంబర్లుతో పాటు వార్డు కౌన్సిల్ సభ్యులు కూడా ఎమ్మెల్యే వెంటే నడవడంతో నియోజకర్గం మొత్తం పసుపు పార్టీ నేతలతో నిండిపోనుంది. ఇదే తరుణంలో పార్టీలోని కొంతమంది నాయకులు రాజుల చేరికపై పెదవివిరుస్తున్నట్టు భోగట్టా. ప్రధానంగా నియోజకవర్గంలో మండలాల పరిధిలో ఉన్న పలు గ్రామాల్లో దేశంపార్టీ నాయకులకు, వైఎస్‌ఆర్‌సిపి నాయకులకు మధ్య విభేదాలు పొడచూపే పరిస్థితి నెలకొంది. గత కొనే్నళ్లుగా ఇరుపార్టీల మధ్య వైరాన్ని కొనసాగిస్తున్న నేతలు ఒక్కసారి కలిసేందుకు సుముఖంగా లేరు. అయినప్పటికీ బొబ్బిలి రాజవంశీయులు దేశంలో చేరికతో ఈ నేతల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. పురపాలకసంఘం విషయానికి వస్తే ఇంతవరకు చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లితోపాటు దేశంపార్టీ కౌన్సిల్ సభ్యులను వ్యతిరేకిస్తున్న వైఎస్‌ఆర్‌సిపి కౌన్సిల్ సభ్యులు కలయికపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇటీవల ఇరుపార్టీల కౌన్సిల్ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, పోలీసు ఫిర్యాదువరకు వెళ్లిన విషయం విధితమే. దీంతో పురపాలకసంఘం అంతా చర్చనీయాంశమైంది. ఈ మేరకు బొబ్బిలి రాజసోదరులతోపాటు అనుచరులు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, వార్డు కౌన్సిల్ సభ్యులంతా విజయవాడ బయలుదేరి చంద్రబాబు సమక్షంలో దేశం తీర్దం తీసుకునేందుకు బయలుదేరారు. ఏదిఏమైనా నియోజకవర్గంలో వైకాపా పార్టీలో పూర్తిగా నేతలు నిల్ కావడంతో భవిష్యత్ ప్రణాళికలపై వైకాపా జిల్లా నాయకులు దృష్టిసారిస్తున్నారు.