విజయనగరం

ఆంధ్ర జట్టుకే విజ్జి ట్రోఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 18: క్రీడల్లో మనం ఎవరికన్నా తక్కువ కాదని నిరూపించాలని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన విజ్జి స్టేడియంలో జరిగిన క్రికెట్ టోర్నీ ముగింపు ఉత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1917లో సర్ విజ్జి ప్రారంభమైందని 1934 వరకు కొనసాగిందన్నారు. ఇప్పుడు ట్రోఫీ పునరుద్ధరణ చేయడం ఆనందంగా ఉందన్నారు. క్రీడలలో గెలుపు, ఓటములు సహజమని, ఓటమి చెందిన వారు నిరుత్సాహపడకుండా ద్విగుణీకృత ఉత్సాహంతో తదుపరి పోటీల్లో గెలుపొందాలన్నారు. దేశవ్యాప్తంగా 30 క్రికెట్ మైదానాలు తయారుకాగా, వాటిలో 20 క్రికెట్ మైదానాలకు ఎంపి గోకరాజు గంగరాజు పాత్ర కీలకమన్నారు. మంత్రి సుజయ్‌కృష్ణ మాట్లాడుతూ 8 దశాబ్ధాల తరువాత కేంద్ర మంత్రి అశోక్ చొరవతో ఇన్విటేషన్ క్రికెట్ పేరుతో విజ్జి ట్రోఫీ టోర్నమెంట్ నిర్వహించడం ముదావహమన్నారు. ఎంపి గోకరాజు గంగరాజు మాట్లాడుతూ 1917 నుంచి వందేళ్లపాటు సర్ విజ్జి ట్రోఫీని భద్రపరచి టోర్నమెంట్ పునరుద్ధరణకు కృషి చేయడం అభినందనీయమన్నారు. దేశం నుంచే గాక విదేశాల నుంచి క్రికెట్ టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు పాల్గొనడం శుభపరిణామమన్నారు. ఈ టోర్నీలో ఆంధ్ర లెవెన్, ఆంధ్ర ప్రెసిడెంట్స్ లెవెన్, బరోడా క్రికెట్ అసోసియేషన్, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఒఎన్‌జిసి, హిందుస్థాన్ పెట్రోలియం క్రికెట్ అసోసియేషన్, నైరోబి క్రికెట్ అసోసియేషన్ మొదలగు ఎనిమిది జట్లు పోటీల్లో తలపడగా, ఆంధ్ర లెవెన్, ఆంధ్ర ప్రెసిడెంట్స్ లెవెన్ జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రెండు జట్లను విజేతలుగా ప్రకటించిన నిర్వాహకులు ఆ రెండు జట్లకు సర్ విజ్జి ట్రోఫీతోపాటు రూ.3 లక్షల చెక్కును అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా క్రికెట్ సంఘం, జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులతోపాటు వివిధ జిల్లాల క్రికెట్ సంఘాల ప్రతినిధులు, మాన్సాస్ ట్రస్ట్‌ప్రతినిధి అదితి పాల్గొన్నారు.

విజ్జిలో క్రీడా పాఠశాలకు పరిపాలన ఆమోదం
* రూ.20 లక్షలు నిధులు విడుదల
విజయనగరం, సెప్టెంబర్ 18: జిల్లాలోని విజ్జి స్టేడియంలో క్రీడా పాఠశాల నిర్మాణానికి పరిపాలన ఆమోదం లభించింది. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు చొరవతో ఈ పాఠశాల మంజూరైన విషయం విధితమే. వచ్చే ఏడాది నుంచి క్రీడా పాఠశాలలో ప్రవేశాలు ఉంటాయి. సుమారు రూ.40 లక్షల అంచనాలతో నిర్మించనున్న ఈ పాఠశాలకు తొలి విడతగా రూ.20 లక్షలు విడుదల చేస్తూ క్రీడాప్రాధికార సంస్ధ వైస్‌చైర్మన్ బంగార్రాజు ఉత్తర్వులు జారీ చేశారు.

సిఎం దృష్టికి జిల్లా సమస్యలు : కలెక్టర్

విజయనగరం, సెప్టెంబర్ 18: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సులో జిల్లా సమస్యలు ప్రస్తావించనున్నట్టు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. సోమవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయే శాఖల్లో ఏ రకమైన సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌ఎ పిఒ లక్ష్మణరావు మాట్లాడుతూ అదనపు వసతుల నిర్మాణానికి రూ.16.44 కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉందన్నారు. జిల్లాలో మరో రెండు న్యూట్రిషన్ రీ-హేబిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటుకు, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు వాహనాల సంఖ్యను పెంచాలని ప్రతిపాదించాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్ పద్మజ కోరారు. ఉద్యానవనశాఖ అధికారుల పోస్టులు ఖాళీలు ఉన్నాయని డిడి లక్ష్మినారాయణ తెలిపారు. జిల్లాలో రేషనలైజేషన్ తరువాత హిందీ, తెలుగు సబ్జెక్టులలో 55 మంది ఉపాధ్యాయులు అవసరమని డిఇఒ అరుణకుమారి తెలిపారు. ఆర్‌ఎంఎస్‌ఎ కింద చేపట్టిన పాఠశాల భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని డిఇఒ కోరారు. ఉపాధి హామీ, నీరు చెట్టు తదితర పథకాలకింద నిధుల విడుదలకు ప్రస్తావించాలని డ్వామా పిడి కోరారు. విజయనగరం ఇరిగేషన్ డివిజన్‌ను బొబ్బిలిలోని ఎస్‌ఇ పరిధిలోకి తెచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉపాధి హామీ వేతనాల కింద రూ.46 కోట్లు విడుదల చేయాల్సి ఉందని డ్వామా పిడి తెలిపారు. ఈ సమావేశంలో జెసి లఠ్కర్, ఐటిడిఎ పిఒ లక్ష్మిశ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మావోల కార్యకలాపాలు తగ్గుముఖం
* విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్
గుమ్మలక్ష్మీపురం, సెప్టెంబర్ 18: విశాఖ రేంజ్ పరిధిలో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్ అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఎల్విన్‌పేట పోలీస్ స్టేషన్‌ను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా డిఐజి విలేఖర్లతో మాట్లాడారు. ప్రజలు మావోయిస్టులను ఆదరించడం లేదన్నారు. యువత మావోయిస్టుల సిద్ధాంతాలకు ఆకర్షితులు కావడం లేదని, దీంతో మావోయిస్టుల రిక్రూట్‌మెంట్ పూర్తిగా తగ్గిందన్నారు. గంజాయి సాగును అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ సిబ్బందితో బృందాలను ఏర్పాటుచేసి గంజాయి సాగును అడ్డుకుంటున్నామన్నారు. 135 గిరిజన గ్రామాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్లు గుర్తించామని, వీటిని అరికట్టేందుకు తమ బృందాలు ఆయా గ్రామాల్లో పనిచేస్తున్నాయని అన్నారు. గిరిజన రైతులకు గంజాయి సాగువలన కలిగే అనర్ధాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే 1200కోట్ల రూపాయలతో మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. రాబోయే మూడేళ్లలో రహదారి నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. విశాఖ రేంజ్ పరిధిలో 60 ఎస్‌ఐలు శిక్షణ పొందుతున్నారని, వీరంతా త్వరలో విధుల్లో చేరుతారన్నారు. ఈయన వెంట ఏఎస్పీ అమిత్ బర్దార్, సిఐ రాము, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌నాయుడు పాల్గొన్నారు.