విజయనగరం

స్వచ్ఛతే సేవకు నడుం బిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 19: స్వచ్ఛతే సేవకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. జాతపిత మహాత్మగాంధీ కలలు కన్న స్వచ్ఛ భారతావని సాకారం చేయడానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. మహారాజా అటానమస్ కళాశాలలో భారతప్రభుత్వ కేంద్ర సమాచార ప్రసారాలశాఖ, క్షేత్ర ప్రచార విభాగం, విశాఖపట్నం ఆధ్వర్యంలో స్వచ్ఛతే సేవలో భాగంగా మంగళవారం ప్రత్యేక సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గీత మాట్లాడుతూ 2018 మార్చి నాటికి విజయనగరం జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత(ఓడిఎఫ్) జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వచ్ఛతే సేవ లక్ష్యంగా కలిసికట్టుగా నడుం బిగించవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛతే సేవను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. కేంద్ర సమాచార క్షేత్ర ప్రచార విభాగం సహాయ సంచాలకుడు శ్రీనివాస మహేష్ మాట్లాడుతూ దేశంలో స్వచ్ఛ్భారత్ మిషన్ ప్రారంభానికి 39శాతం ఉన్న పారిశుద్ధ్యం, నేడు 67.5శాతానికి చేరుకుందని తెలిపారు. స్వచ్ఛ్భారత్ మిషన్ ద్వారా ఇంతవరకు 4.6 కోట్ల గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్లను కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు నిర్మించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఆర్‌ఎస్ రాజ్‌కుమార్, మహారాజా అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కళ్యాణి, స్వచ్ఛ్భారత్ మిషన్ జిల్లా కో-ఆర్డినేటర్ సుధాకర్ పాల్గొన్నారు.

మూత కప్పండి
విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 19: పట్టణంలోని తోటపాలెం సాయినగర్ రహదారి పక్కన కుళాయికి సంబంధించి ఏర్పాటు చేసిన గొయ్యిని పని పూర్తి అయి పక్షం రోజులు గడిచిన కప్పకపోవడం వలన ప్రమాదాలు చోటుచేసుకునే ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే గొయ్యిపై మూతను వేసి కప్పాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం శ్రీనివాసా కోరారు. ఈ రహదారిలో పలు కళాశాలలు నివాసాలు ఉన్నాయని నిత్యం వందల సంఖ్యలో వాహనాలు వస్తాయని విద్యార్ధులు వాహనాదారలు ఏమరుపాటుకు గురయితే ఈ గొయ్యిలో పడే ప్రమాదం ఉందని తక్షణం పురపాలక సంఘ అధికారులు స్పందించి గొయ్యినపై మూత కప్పాలని కోరారు.