విజయనగరం

జిల్లాలో 1500 ఎకరాలలో పశుగ్రాస క్షేత్రాల లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, సెప్టెంబర్ 19: జిల్లాలో 1500 ఎకరాలలో పశుగ్రాస క్షేత్రాలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా పశుసంవర్థకశాఖ సంయుక్త సంచాలకుడు ఎండ సింహాచలం అన్నారు. మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఆరు మండలాల పాడి రైతులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1600 ఎకరాలు గుర్తించగా 1500 ఎకరాలలో పశుగ్రాస క్షేత్రాలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇంతవరకు 900 ఎకరాలలో ప్లాంటేషన్ జరిగిందన్నారు. నెలాఖరులోగా శతశాతం ప్లాంటేషన్ జరగడానికి సహకరించాలని కోరారు. నీటివసతి గల భూముల రైతులను గుర్తించి వారికి కౌలు చెల్లిస్తామన్నారు. ఆ భూమిలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులు పెంచాలన్నారు. ఉత్పత్తి ప్రశుగ్రాసాన్ని కిలోరూపాయికి అవసరమైన పాడి రైతులకు విక్రయించాలన్నారు. ఏడాదిలో ఐదుసార్లు పశుగ్రాస క్షేత్రాలు పెంపకం చేపట్టవచ్చు అని చెప్పారు. దీంతో రైతుకు 50 నుంచి 60వేల రూపాయలు ఆదాయం లభిస్తుందన్నారు. ఎకరాకి 38వేల రూపాయలు ఉత్పత్తి ఖర్చు అవుతుందని రెండేళ్లపాటు ఈ పథకం కొనసాగుతుందన్నారు. ఈ క్షేత్రాల వలన పశుగ్రాస భద్రతతోపాటు పాల ఉత్పత్తి ఖర్చు తగ్గించవచ్చని అన్నారు. తొలిపెంపకంలోనే తప్పనిసరిగా కలుపుతీయాలన్నారు. పశుగ్రాస క్షేత్రాలు పెంచడానికి ముందుకురాని రైతులను ప్రోత్సహించాలన్నారు. ఇందుకు వెలుగు అధికారులు చురుకుగా పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎడిఎ శ్రీనివాసరావు, వెలుగు ప్రాంతీయ సమన్వయకర్త బంగారమ్మ, ఎపిఎంలు శ్రీనివాసరావు, పెంటంనాయుడు, పశువైద్యాధికారులు, గజపతినగరం, బొండపల్లి, మెంటాడ, దత్తిరాజేరు, బాడంగి, రామభద్రపురం మండలాల నుండి పాడి రైతులు పాల్గొన్నారు.

మహిళ హత్య కేసులో
ఇద్దరు నిందితులకు యావజ్జీవం
గరివిడి, సెప్టెంబర్ 19: వివాహిత హత్యకేసులో ఇద్దరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ విజయనగరం అదనపు జిల్లా జడ్జి వి.వేంకటేశ్వరరావు మంగళవారం తీర్పు ఇచ్చారు. కరణం ఢిల్లీశ్వరి(32) అనే వివాహిత మహిళ 2013 ఫిబ్రవరి-1 తేదీన హత్యకు గురైంది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిలైన గరివిడి మండలం వి.పి.రేగ గ్రామానికి చెందిన రాయల సతీష్ విశాఖకి చెందిన ఆటో డ్రైవర్ బల్లాన అనీల్ అనే ఇద్దరు నిందితులకు హత్యకేసులో ముద్దాయిలుగా రుజువుకావడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధించారని ఎస్సై ఎస్.శ్రీనివాస్ తెలిపారు. చీపురుపల్లిలో నివాసం ఉంటున్న మల్లీశ్వరి తమ అత్తవారు గ్రామమైన వి.పి.రేగకి 2013 జనవరి30వ తేదీన వెళ్లి అదేరోజు సాయంత్రం నివాస గ్రామమైన చీపురుపల్లికి ఆటోలో తిరుగుప్రయాణమైంది. ఆరోజు రాత్రి ఆమె ఇంటికి చేరుకోకపోవడంతో లారీడ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త రాము, బంధువులు ఆమెకోసం గాలించారు. 2013 ఫిబ్రవరి1వతేదీ గరివిడి మండలం దుమ్మెద-కోడూరు గ్రామాల మధ్య మామిడి తోటలో ఒంటిపై తీవ్ర గాయాలతో మృతదేహాన్ని గుర్తించారు. హత్యకేసులో నిందితుడు సెల్‌ఫోన్ వినియోగం, ఇతర అంశాలపట్ల నిందితులు జాగ్రత్త తీసుకోవడంతో పోలీసులకు కేసును చేధించడం కష్టతరమైంది. ఒక చిన్న క్లూ ఆధారంగా పట్టుబడిని నిందితులు విచారణలో నేరం రుజువు కావడంతో శిక్షలు పడ్డాయి. ఈ కేసును అప్పటి సిఐ మోహనరావు సమక్ష్యంలో దర్యాప్తుకాగా, ప్రస్తుత చీపురుపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సిహెచ్.శ్యామలరావు, గరివిడి ఎస్సై శ్రీనివాస్ కేసు కీలక విచారణలో సహకరించడంతో నేరం రుజువైంది.

జాతీయ రహదారికి అడ్డంగా పడిన క్రేన్
* నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్
గజపతినగరం, సెప్టెంబర్ 19: ఆర్టీసీ బస్సును తొలగిస్తున్న సమయంలో క్రేన్ జాతీయ రహదారికి అడ్డంగా పడిపోవడంతో నాలుగు గంటలపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయనగరం డిపోకు చెందిన ఆండ్ర బస్సు వి జయనగరం నుండి రాత్రి పది గంటల సమయంలో ఆండ్ర వెళుతుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి కొంతభాగం చెరువులోకి ఒరిగింది. ఈ ప్రమాదంలో బాడంగి మండలం కో డూరుకి చెందిన తెంటు జనార్థనరావు తీవ్రగాయాలు కావడంతో విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 50 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరికి ఎటువంటి ప్ర మాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తెల్లవారున ఒకపక్క లారీ, మరోపక్క క్రేన్ సహాయంతో బస్సును పక్కకు నెడుతున్న సమయంలో క్రేన్ రహదారికి అడ్డంగా పడింది. దీంతో విజయనగరం నుండి బొబ్బిలి, పార్వతీపురం, ఒడిశా, విశాఖపట్నం వెళ్లడానికి వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర లారీలు, బస్సులు, వ్యాన్లు, ఆటోలు వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఈ సంఘటన తెల్లవారుజామున జరగడంతో ప్రయాణీకులు నరకయాతన పడ్డారు. కొంతమంది వాహనాల డ్రైవర్లు, ప్రయాణీకులు రహదారిపైనే నిద్రించారు. గజపతినగరం సబ్ ఇన్‌స్పెక్టర్ పి.వరప్రసాద్ పర్యవేక్షణలో పోలీసులు జెసిబిని తీసుకువచ్చి క్రేన్, బస్సులను ఉదయం తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు.