విజయనగరం

రాష్ట్రంలో జిల్లాకు అత్తున్నత గ్రేడింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలకు కేటాయించిన గ్రేడింగ్‌లో విజయనగరం జిల్లా ‘ఎ’ ప్లస్ ప్లస్ గ్రేడ్ లభించింది. రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు ఈ గ్రేడ్ ఇచ్చింది. వాటిలో విజయనగరం,పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. తరువాత స్థానంలో చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లిలు ఉన్నాయి. వీటికి ఎ ప్లస్ లభించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, కడప, అనంతపూర్ ‘ఎ’ రేటింగ్ సాధించాయి. తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లా రూ.1.61 లక్షలతో మొదటి స్థానంలో నిలవగా, శ్రీకాకుళం జిల్లా రూ.94,118తో చివరి స్థానంలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో జాతీయ స్థాయిలో వృద్ధిరేటు 5.6 శాతం ఉండగా, మన రాష్ట్రం 11.725 వృద్ధి రేటు సాధించింది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో 58 శాతం సంతృప్తి వ్యక్తమవుతొందని, దీనిని 80 శాతానికి చేర్చే లక్ష్యంతొ జిల్లా కలెక్టర్లు పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్టు సమాచారం.

అండగా ఉండండి..
అభివృద్ధికి సహకరించండి
* టిడిపి పట్టణ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్
విజయగరం (్ఫర్టు), సెప్టెంబర్ 22: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రజలు అండగా ఉండాలని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ కోరారు. ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా 11వ వార్డులో శుక్రవారం పర్యటించారు. కోట జంక్షన్‌వద్ద దివంగత ముఖ్యంత్రి ఎన్‌టి రామారావువిగ్రహానికి పూలమాల నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. చంద్రబాబు పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తిచేసేందుకు నిరంతరం శ్రమిస్తుంటే, ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపక్షనేతలు అడ్డుపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపిరాజు, వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ సైలాడ త్రినాధరావు, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దాల ముత్యాలరావు, నాయకులు పసగాడ రామకృష్ణ, తోలాపి మోహనరావు, మున్సిపల్‌కౌన్సిలర్లు చెన్నా రూపవాణి, మైలపిల్లి పైడిరాజు పాల్గొన్నారు.