విజయనగరం

విమాన సేవల్లో ప్రపంచంలోనే 4వ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, సెప్టెంబర్ 24: పౌరవిమానయాన సేవల్లో మనదేశం ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉందని కేంద్ర పౌర విమానయానశాఖామంత్రి పూసపాటి అశోకగజపతిరాజు తెలిపారు. ఆదివారం పార్వతీపురంలోని టిడిపి కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో అశోక్ మాట్లాడుతూ గతంలో ప్రపంచంలో 9,10 స్థానాల్లో ఉండే మనదేశం ఇప్పుడు 4వ స్థానానికి చేరుకుందన్నారు. విమానసేవలు ప్రజలకు మెరుగ్గా అందించే దిశగా కృషికి ఇదో తార్కాణమన్నారు. విమాన సర్వీసులు పెంచడానికి ప్రభుత్వ అనుమతుల కోసం ఇబ్బందులు పడకుండా పారదర్శకంగా వీటి అనుమతులు సరళీకృతం,సులభతరం చేశామన్నారు. విమానాల సేవలను సేఫ్టీ సెక్యూరిటీ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పర్యవేక్షి స్తారన్నారు. విమానాల రక్షణ, ఇతర అంశాలపై నిఘా పెట్టడానికి చర్యలు మరింతగా ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఈస్ట్‌కోస్ట్‌లో రెండు, వెస్ట్‌కోస్ట్‌లో రెండు కొత్తగా విమానాశ్రయాలను నెలక్పొడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. గోవాలోని మోపాలోనూ, విశాఖ పరిధిలోని భోగాపురం విమానాశ్రయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. షిర్డీలోని విమానాశ్రయం నెలకొల్పడానికి లైసెన్సు కూడా ఇచ్చామన్నారు. గన్నవరం, రాజమండ్రి విమానాశ్రయాల రన్‌వేను విస్తరించడానికి చర్యలు తీసుకున్నామని మంత్రి అశోక్ తెలిపారు.
సోలార్ వినియోగంతో విద్యుత్ బిల్లుల తగ్గించుకోవాలి
స్థానిక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని మంత్రి అశోక్ అన్నారు. ఇందులో భాగంగా విజయనగరం మున్సిపాలిటీలో విద్యుత్ బిల్లుల ఛార్జీలు తగ్గించడానికి సోలార్ సిస్టమ్ విధానం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రయోగాత్మకంగా దీనిని చేపట్టిన తరువాత విశాఖ తదితర ప్రాంతాల్లో కూడా ఈమార్గం అనుసరించడానికి చర్యలు చేపట్టే అవకాశం ఉందన్నారు. మున్సిపాలిటీలో తాగునీరు, ఇతర అసరాలకు తప్పనిసరిగా విద్యుత్ బిల్లులు నెలకు రూ.32లక్షలు వరకు చెల్లించాల్సి వస్తున్నందున విజయనగరం మున్సిపాలిటీ ఆర్థికంగా చాలావరకు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజా సౌకర్యాలు పెంచడానికి అభివృద్ధి పనులు చేపట్టడానికి ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి అశోక్ అన్నారు. అందుకు సోలార్ ద్వారా విద్యుత్‌ను ఉపయోగించుకునే ఈప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించే ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ఆర్థికపరిస్థితులు చక్కబడడానికి కేంద్ర ప్రభుత్వ ఆర్థికసాయం ఎంతైనా తోడ్పాటు అందించాల్సి ఉందన్నారు.
విద్యకు తోడ్పడిన చిట్టిగురువులు భేష్
తాను దత్తత తీసుకున్న ద్వారపూడిలో అక్షరాస్యత పెంపొందించడానికి చిట్టిగురువులు చేపట్టిన అక్షరాస్యత విజయవంతం కావడంపై మంత్రి అశోక్ ఆనందం వ్యక్తం చేశారు. పలువురు తల్లిదండ్రులు, వయోజనులు 500మంది అక్షరాస్యత సాధించడం జరిగిందన్నారు.అక్షరాస్యులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారన్నారు. బాడంగి మండలంలోని ముగడలో ఇదే స్పూర్తితో అక్షరాస్యత కార్యక్రమం చేపట్టేచర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.దేశంలో అక్షరాస్యత ఆశించినంత లేకపోవడం విచారకరమన్నారు. అక్షరాస్యతను పెంపొందించడానికి తగిన స్పూర్తిని రగిలించాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని ఆయన కోరారు. గ్రామాల్లో విజయవంతం అవుతున్నప్పటికీ ఈ అక్షరాస్యత కార్యక్రమం మున్సిపాలిటీల్లో విజయవంతంగా చేపడితే మరింత బాగుందన్నారు. ఈ సమావేశంలోఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, గాదె శ్రీనివాసుల నాయుడు,జిల్లా తెదేపాఅధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు స్థానిక నాయకులు పాల్గొన్నారు.