విజయనగరం

కాలువ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం (రూరల్), సెప్టెంబర్ 24: మున్సిపాలిటీలో పలుచోట్ల నిర్మాణం జరుగుతున్న కాలువ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన స్థానిక రాయగడ రోడ్డులో రూ.5లక్షల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటించాలని, సత్వరమే పూర్తి చేయాలన్నారు. ప్రజలు తమతమ ప్రాంతాలలోని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. వాటి పరిష్కారానికి తక్షణమే స్పందిస్తామన్నారు.

పలు కార్యక్రమాలకు కేంద్రమంత్రి శ్రీకారం
పార్వతీపురం, సెప్టెంబర్ 24: పార్వతీపురం పట్టణంలోని పలు కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర పౌరవిమానయానశాఖా మంత్రి పూసపాటి అశోకగజపతిరాజు ఆదివారం శ్రీకారం చుట్టారు. పార్వతీపురం ఏరియా ఆసుపత్రి మార్గంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కోర్టు ఆవరణలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడకి సమీపాన మెయిన్‌రోడ్డులో ఉన్న గురజాడ అప్పారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీశ్వరావు, గాదె శ్రీనివాసులనాయుడు, మున్సిపల్ చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నాగభూషణరావు, తెదేపా నేతలు పాల్గొన్నారు.