విజయనగరం

ఆశ్రమ విద్యార్థులు.. మూడు గిన్నీస్ రికార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 25: ఎపి సాంఘీక సంక్షేమ ఆశ్రమ విద్యా సంస్థల విద్యార్ధులు మూడు కేటగిరీలలో గిన్నీస్ రికార్డును సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ సోమవారం సిబ్బందిని అభినందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న విశాఖలో 7002 మంది విద్యార్థులతో అతి పెద్ద కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించడంతోపాటు మారధాన్ రిలే 25.2గంటలు ప్రదర్శించినందుకు గిన్నీస్ రికార్డు సాధించారు. అలాగే విజయవాడలో 2315 మంది విద్యార్థులు సంప్రదాయ కర్రలతో నృత్య ప్రదర్శన చేసి గిన్నీస్ రికార్డు సాధించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు సంస్థ వీటిని ధ్రువీకరిస్తూ మూడు గిన్నీస్ రికార్డులకు సంబంధించి ధ్రువపత్రాలను జారీ చేసింది. ఈ మూడు ప్రదర్శనలలో విజయనగరం జిల్లాకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, ఈ సర్ట్ఫికేట్‌ను ఎపి సాంఘీక సంక్షేమ ఆశ్రమ విద్యా సంస్థ సెక్రటరీ కల్నర్ వి.రాములు ఆ సర్ట్ఫికేట్‌ను జిల్లా కోఆర్డినేటరు కార్యాలయానికి పంపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిన్నీస్ వరల్డ్ రికార్డులో జిల్లాకు చెందిన విద్యార్థులు భాగస్వాములు కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జెసి లఠ్కర్, జెసి నాగేశ్వరరావు, డిఆర్వో రాజ్‌కుమార్‌లు పాల్గొన్నారు.