విజయనగరం

ఒడిఎఫ్ జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 25: స్వచ్ఛ భారత్‌లో జిల్లాకు జాతీయ స్థాయిలో 216 ర్యాంకు లభించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ర్యాంకులను ప్రకటించిన విషయం విధితమే. అందులో విజయనగరం జిల్లాకు 216 ర్యాంకు లభించడం పట్ల జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. వచ్చే నెల 2వ తేదీ నాటికి జిల్లాను వంద లోపు ర్యాంకింగ్ వచ్చే విధంగా ఒడిఎఫ్ నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. గత నెలకు విజయనగరం జిల్లా జాతీయ స్థాయిలో 492 ర్యాంకులో ఉండేదని, కేవలం 50 రోజుల వ్యవధిలో 216 ర్యాంకుకు చేరుకున్నామన్నారు. వచ్చే నెల 2 నాటికి వంద లోపు ర్యాంకు సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకింగ్‌లకు పలు అంశాలను ప్రాతిపధికగా తీసుకున్నారు. వాటిలో మరుగుదొడ్లు కలిగి ఉన్న కుటుంబాల సంఖ్య, వాటి వినియోగం, జియోట్యాగ్‌కు అనుసంధానం చేయడం తదితర వాటిని ప్రామాణికంగా చేసుకొని ర్యాంకింగ్‌ను కేటాయించారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 2 నాటికి లక్ష మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 24వేలు నిర్మించగలిగామన్నారు. మిగిలిన వాటిని కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన టెలీ కానె్ఫరెన్స్‌లో మండల స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సదస్సులో ప్రస్తావించిన అంశాల గురించి వివరించారు. జిల్లాకు సంబంధించిన సమస్యలు, జిల్లాలో సాధించాల్సిన లక్ష్యాలపై ఆయన మండల స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో ప్రతి వారం ఐదు వేల మరుగుదొడ్లను నిర్మించాలని వచ్చే ఏడాది మార్చి నాటికి జిల్లాను ఒడిఎఫ్‌గా తీర్చిదిద్దాలన్నారు. ఒడిఎఫ్‌కు ఎంపిక చేసిన గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వాటి వినియోగంపై ప్రజల్లో ప్రేరణ కలిగించేందుకు స్వచ్ఛ గ్రాహిలను నియమించాలన్నారు. నిర్మించిన వాటికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో జియోట్యాగింగ్ చేయాలన్నారు. ఇప్పటికే 90 శాతం మరుగుదొడ్లను జియోట్యాగ్ చేశారని తెలిపారు.

చంద్రబాబు పాలనలోనే రాష్ట్భ్రావృద్ధి
చీపురుపల్లి, సెప్టెంబర్ 25: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమని శాసనసభ్యురాలు కిమిడి మృణాళిని అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీలో భాగంగా మండలంలోని పికె పాలవలస, జి అగ్రహారం గ్రామాల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. ఎన్నికల ము ందు ఇచ్చిన హామీల్లో డ్వాక్రా, రైతు రు ణమాఫీలను ప్రధానంగా అమలు చేశారని గుర్తుచేశారు. అర్హులైన వారందరికీ పెంచిన పింఛన్లు ఇస్తారన్నారు. నదులు అనుసంధానంతో గ్రామీణ ప్రా ంతాల్లో వ్యవసాయానికి నోచుకోని భూములకు సాగునీరు అందించిన ఘ నత తమ ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో జెడ్పీటిసి మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గ నాయకుడు కుట్చెర్లపాటి త్రిమూర్తులరాజు, మండ ల అధ్యక్షుడు రౌతుకామునాయుడు, తెలుగు యువత నాయకుడు కిమిడి నాగార్జున, సత్యనారాయణ, శ్రీరాములనాయుడు పాల్గొన్నారు.

‘విద్యుత్ అధిక బిల్లులను తగ్గించండి’
చీపురుపల్లి, సెప్టెంబర్ 25: విద్యుత్ వినియోగంలో తక్కువగా వినియోగించినా అధిక మొత్తంలో బిల్లులు రావడంపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆర్‌ఇసిఎస్ ఛైర్మన్ దన్నాన రామచంద్రుడు అన్నారు. గ్రీవెన్స్ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఛైర్మన్ రామచంద్రుడు వినియోగదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన గొల్లలపాలెం, పత్తికాయవలస, బైరెడ్డిపేట గ్రామస్థులు విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చినట్టు ఫిర్యాదు చేశారు. గరివిడి మండలం తాటిగూడలో ట్రాన్స్‌ఫ్మార్ వెయ్యాలని, కొండపాలెంలో విద్యుత్ స్థంభాలు చేయాలని వినతులు అందజేశారు. పేరిపి గ్రామంలో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరారు. మెరకముడిదాం మండలం రామరాజుపేటలో వ్యవసాయదారులకు కొత్తగా అవసరమైన పంపుసెట్లను మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. వినతులపై స్పందిస్తూ అధికబిల్లులు వచ్చిన వాటికి వీలైనంత వరకు తగ్గించాలని, విద్యుత్ పరికరాలు అవసరమైన చోట ఏర్పాటు కు సామగ్రిని సిద్ధం చేసుకోవాలని, వ్యవసాయ పంపుసెట్లకు అంచనాలు రూ పొందించాలని రామచంద్రుడు అదేశించారు. గ్రీవెన్స్‌లో ఎండి పి.రమేష్ పాలకవర్గ సభ్యులు, ఎవో త్రినాధ్, ఎడిఇలు వర్మ, జగన్నాణం, మేనేజర్ సుధాకర్, విఓ రామకృష్ణ పాల్గొన్నారు.