విజయనగరం

క్యూ కట్టిన అగ్రిగోల్డ్ బాధితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, అక్టోబర్ 12: అగ్రిగోల్డ్ బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయాలవద్ద ఆధారాలతో పేర్లు నమోదుచేసుకోవడాని కి గురువారం క్యూ కట్టారు. డిపాజిట్లకు సంబంధించి బాండ్లతో నమోదుకు స్టేషన్ల వద్ద క్యూ కట్టారు. కొత్తవలస పోలీస్ స్టేషన్ వద్ద అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువ మొత్తంలో వచ్చి పేర్లు నమోదుకు పోటీ పడ్డారు. ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల నుండి ఒకేసారి రావద్దని, ముందుగా ఏయే గ్రామం నుండి ఎవరెవరు రావాలో సమాచారం ఇస్తామని పోలీసులకు నచ్చజెప్పారు. పూర్తి ఆధారాలు బ్యాంకు ఖాతాతోపాటు కంపెనీకి కట్టిన రశీదులు, బాండ్లు ఉండాలన్నారు. నెట్ సరిగ్గా పనిచేయక పోవడంతో రిజిస్ట్రేషన్‌నికి అంతరాయం ఏర్పడింది. దీంతో విసిగెత్తిన బాధితులు తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగారు.

సంఘటితంతోనే ఆటో కార్మికుల సమస్యల సాధన
* సిటు డివిజన్ కార్యదర్శి రెడ్డిశంకరరావు
విజయనగరం(టౌన్), అక్టోబర్ 12: ఆటోకార్మికుల సమస్యల సాధన సిటు పోరాడుతుందని డివిజన్ కార్యదర్శి రెడ్డిశంకరరావు తెలిపారు. గురువారం పట్టణంలోని కొత్తపేట ఆటో స్టాండ్‌కు చెందిన పలువురు ఆటో కార్మికులు సిటు కార్మిక సంఘంలో చేరారు. ఈసందర్భంగా యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులను ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ ఆటోకార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని పాలకులను డిమాండ్ చేసారు. ఏ ఉపాధి లేక ఆటో నడుపుతు జీవనం సాగిస్తున్న ఆటోకార్మికులపై రవాణా, పోలీసు అధికారులు కేసులు పేరుతో వేధింపులకు గురిచేయడం తగదని అన్నారు. రహదారి ప్రమదాలు జరిగితే కార్మికులను బాధ్యులుగా చేయడం సమంజసం కాదని అన్నారు. ఆటోకార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేవరకు పోరాడుతామని చెప్పారు. ఈకార్యక్రమంలో యూనియన్ నాయకులు బొమ్మనపాపారావు, అధ్యక్షుడు కెశ్రీను, రామకృష్ణ, కొత్తపేట స్టాండ్ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ, ప్రకాష్, బూర్లె రమణ పాల్గొన్నారు.