విజయనగరం

ఒడిఎఫ్ పంచాయతీలకు రూ.3.75 కోట్లు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 12: ఒడిఎఫ్ గ్రామ పంచాయతీల మరుగుదొడ్ల నిర్మాణాల కోసం రూ.3.75 కోట్లు విడుదల చేసినట్టు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. గత ఏడాది 766 గ్రామ పంచాయతీలను ఒడిఎఫ్ చేయడానికి ఎంపిక చేయగా వాటిలో ఇప్పటి వరకు 80136 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన 19736 మరుగుదొడ్ల నిర్మాణాలు సగం దశలో ఉన్నాయన్నారు. వీటికి నిధుల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. గ్రామ పంచాయతీలు త్వరితగతిన మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఆయన కోరారు.

‘అంగన్‌వాడీల జీతాలు వెంటనే పెంచాలి’
కొత్తవలస, అక్టోబర్ 12: అంగన్‌వాడీల జీతాలు వెంటనే పెంచి జీవో-32ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డేగల అప్పలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అంగన్‌వాడీ కార్యకర్తలకు 8వేల రూపాయల జీతం ఇవ్వాలని, ఆశావర్కర్లకు, ఆయాలకు జీతాలు పెంచి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల సమస్యలపై ఈ నెల 18 వతేదీ వరకు నిరసనలు చేపడతామని అప్పలరాజు పేర్కొన్నారు. పొరుగురాష్ట్రాలతో పోలిస్తే పని ఎక్కువ, జీతాలు తక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తున్నదని ఆయన మండిపడ్డారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో గాడి అప్పారావు పాల్గొన్నారు.

‘దుస్తుల పంపిణీలో ప్రభుత్వం తీరుమారాలి’
లక్కవరపుకోట, అక్టోబర్ 12: ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా అందజేస్తున్న దుస్తులు ఒకేరంగు కాకుండా 2,3రంగులలో ఇస్తుండడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం చెబుతున్నారు. ప్రతీయేటా దుస్తులు ఒకేరకంగా లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గుర్తించడం కష్టంగా మారింది. ఎవరు ఏ పాఠశాల వారో తెలుసుకోలేక ఉపాధ్యాయులు, ప్రజలు తికమకపడుతున్నారు. ఇప్పటికైనా ఒకేరంగు దుస్తులు సరఫరాచేయాలని లేక విద్యార్థులలో తారతమ్యాలు పెరిగిపోతాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఒకే రంగు దుస్తులను పంపిణీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.