విజయనగరం

పంట సాగు పద్ధతులు మార్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, ఏప్రిల్ 19: పంటల సాగులో పద్ధతులు మార్చుకోవాలని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకురాలు లీలావతి అన్నారు. మంగళవారం మండలంలోని ముద్దూరు గ్రామంలో జరిగిన కిసాన్ సభలో జెడి లీలావతి ప్రసంగించారు. మూస పద్ధతులు మాని ఆధునిక పద్ధతులు అవలంభించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. వర్షాధారంపైనే పంటలు సాగుచేస్తున్నందున అంతర పంటలపైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా వరిచేల గట్లపైన కందిపంట పండించాలని కోరారు. బహు పంటలు సాగువలన రైతులకు మేలు కలుగుతుందని చెప్పారు. ప్రధాన మంత్రి పంటల భీమా పథకం ద్వారా రైతులు బీమా పరిహారాన్ని పొందవచ్చని చెప్పారు. నీటిని భూ సంరక్షణకు ఇంకుడు గుంతలు తీయాలని సూచించారు. ప్రతి రైతు మట్టి నమూనా పరీక్షలు చేయించి ఎరువులు వాడితే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.అదేవిధంగా యాంత్రీకరణ, విత్తనాలు, ఎరువులు ఎంతెంత కావాలో గ్రామస్థాయిలో ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. గ్రామ స్థాయి ప్రణాళికలను త్వరలో ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని చెప్పారు. అనంతరం పలువురు రైతులకు జెడి లీలావతి సందేహాలను నివృత్తి చేసారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కె రవీంద్ర, ఎఇఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.